* సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
* మూడు వారాల్లో మళ్ళీ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వండి
* సెన్సార్ బోర్డ్ కి ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం
విధాత, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్ర విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్ర విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహం చిత్రం విడుదలకు సీబీఎఫ్‌సీ ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై పిటిషనర్, నిర్మాత-దర్శకుడు, సీబీఎఫ్‌సీ తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో తుది ఉత్తర్వులను 22న వెల్లడిస్తామని ధర్మాసనం పేర్కొంది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను రద్దు చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా సోమవారం తీర్పు ఇచ్చారు. మూడు వారాల్లో మళ్ళీ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ కి ఆదేశాలు జారీ చేసింది.