Site icon vidhaatha

TGPSC: BRS రాకేష్ రెడ్డికి.. టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు !

విధాత: బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ (TGPSC) పరువునష్టం దావా నోటీసులు పంపించింది. గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు పంపింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొంది. వారం రోజుల్లో సమాధానం చెప్పనట్లైతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది.

భవిష్యత్తులో టీజీపీఎస్సీ పై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్ధని నోటీసులో డిమాండ్ చేసింది. ఇటీవల హెచ్ సీయూ భూముల వివాదంలో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేశారన్నదానిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు కొంతం దిలీప్, కిశాంక్ లపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.

Exit mobile version