కారా మాస్టారి మ‌ర‌ణం..తెలుగు క‌థ‌కు, సాహితీలోకానికి తీరని లోటు

విధాత:ప్ర‌ముఖ క‌థార‌చ‌యిత‌, క‌థానిల‌యం వ్య‌వ‌స్థాప‌కులు, కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు గ్ర‌హీత‌ కారా మాస్టారుగా ప్రసిద్ధి చెందిన కాళీపట్నం రామారావు మృతి తెలుగు క‌థ‌కు, సాహితీలోకానికి తీర‌ని లోటు. విద్యాబోధ‌న‌, తెలుగు క‌థ‌కుల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలిచిన మాస్టారి సాహిత్య కృషి ఎన‌లేనిది. సామాజిక‌బాధ్య‌త‌, ఉన్న‌త విలువ‌ల‌తో కూడి వారి జీవితం భావిత‌రాల‌కు స్ఫూర్తి కావాలి. ఎంతో ఉన్న‌తాశయంతో మాస్టారు స్థాపించిన క‌థానిల‌యం తెలుగుక‌థ‌కి శాశ్వ‌త చిరునామాగా మారింది. కారా మాస్టారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను. […]

  • Publish Date - June 4, 2021 / 11:44 AM IST

విధాత:ప్ర‌ముఖ క‌థార‌చ‌యిత‌, క‌థానిల‌యం వ్య‌వ‌స్థాప‌కులు, కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు గ్ర‌హీత‌ కారా మాస్టారుగా ప్రసిద్ధి చెందిన కాళీపట్నం రామారావు మృతి తెలుగు క‌థ‌కు, సాహితీలోకానికి తీర‌ని లోటు. విద్యాబోధ‌న‌, తెలుగు క‌థ‌కుల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలిచిన మాస్టారి సాహిత్య కృషి ఎన‌లేనిది.

సామాజిక‌బాధ్య‌త‌, ఉన్న‌త విలువ‌ల‌తో కూడి వారి జీవితం భావిత‌రాల‌కు స్ఫూర్తి కావాలి. ఎంతో ఉన్న‌తాశయంతో మాస్టారు స్థాపించిన క‌థానిల‌యం తెలుగుక‌థ‌కి శాశ్వ‌త చిరునామాగా మారింది. కారా మాస్టారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను.

నారా చంద్ర‌బాబునాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు