Horoscope | 12-01-2025 ఆదివారం.. ఈ రోజు మీ రాశి ఫలాలు! వారికి శుభవార్తలు

Horoscope |జ్యోతిషం అంటే మ‌న‌వారికి చెర‌గ‌ని నమ్మకం. లేచిన స‌మ‌యం నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే ప‌డుచుకుంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది సెర్చ్ చేసేది వారికి ఆరోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం నూతనకార్యాలు ఆలస్యం. అల్పభోజనం వల్ల […]

Horoscope |జ్యోతిషం అంటే మ‌న‌వారికి చెర‌గ‌ని నమ్మకం. లేచిన స‌మ‌యం నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే ప‌డుచుకుంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది సెర్చ్ చేసేది వారికి ఆరోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం
నూతనకార్యాలు ఆలస్యం. అల్పభోజనం వల్ల అనారోగ్యం. ఓ విషయంతో మనస్తాపం. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలు.

వృషభం
శుభకార్య ప్రయత్నాలు సులభం. దూర బంధువులతో కలయిక‌తో లాభాలు. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణం. ఆకస్మిక ధన లాభం. అన్ని విషయాల్లో విజయం.

మిథునం
విదేశీయాన ప్రయత్నాలు అనుకూలం. అనారోగ్య బాధలు అధికం. ఆకస్మిక ధననష్టం. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు. ప్రయాణాలు ఎక్కువ.

కర్కాటకం
విదేశీయాన ప్రయత్నం సులభమ‌వుతుంది. మనోవిచారం. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. ఆకస్మిక ధన నష్ట అవ‌కాశం. నూతన కార్యాలు వాయిదా. ప్రయాణాలు ఎక్కువ.

సింహం
విందులు, వినోదాలకు దూరం మంచిది. ఆకస్మిక ధననష్ట అవకాశం. మానసిక ఆందోళన. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

కన్య
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధన లాభయోగం.


తుల
ఆర్థిక ఇబ్బందులు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

వృశ్చికం
వృత్తి, ఉద్యోగాల్లో కోరుకున్న అభివృద్ధి. ఆకస్మిక ధనలాభం. సంపూర్ణ కుటుంబ సౌఖ్యం. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలు సంతోషించే కార్యాలు, శుభకార్య ప్రయత్నాలు సులభం.

ధనుస్సు
సులభంగా శుభకార్య ప్రయత్నాలు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. నూతన వస్తు, ఆభరణాల ఖరీదు. ముఖ్యమైన కార్యాలు పూర్తి.

మకరం
ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో ఆనందోత్సాహాలు. బంధు, మిత్రులతో కల‌యిక‌. సమాజంలో గౌరవం, సంపూర్ణ ఆరోగ్యం. ప్రతి విషయంలో అభివృద్ధి. సులభంగా శుభకార్య ప్రయత్నాలు.

కుంభం
అనుకూల స్థానచలనం. గృహంలో మార్పు కోరుకుంటారు. ఇతరుల నుంచి విమర్శలు. అస్థిరమైన నిర్ణయాలు . ఆకస్మిక ధనవ్యయ అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్త మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.

మీనం
ప్రయత్నకార్యాలన్నీ స‌ఫలం. ఆకస్మిక ధనలాభం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.