Toilet In Fish Tank | వీళ్ల తెలివి త‌గలెయ్య.! ఆక్వేరియంలో లావెట‌రీ..

A Toilet In Fish Tank | నీళ్లతొట్టి మ‌ధ్యలో పాయ‌ఖానా క‌ట్టిన జ‌పాన్ హోట‌ల్‌ విధాత: జ‌పాన్ వాళ్లకి సాధార‌ణంగానే వింత ఆలోచ‌న‌లు, వింత ఉత్పత్తులు కొత్త కాదు. అయితే ఈ మ‌ధ్య ఓ హోట‌ల్ వాళ్లకి బీభ‌త్సమైన ఐడియా వచ్చింది. చుట్టూ నీళ్లు, అందులో అంద‌మైన చేప‌లు, స‌ముద్రం లోప‌లి చెట్లూచేమ‌లు.. మ‌ధ్యలో గాజుతో నిర్మించిన ఒక అంద‌మైన పాయ‌ఖాన‌ (lavatory). ఎలా ఉంది ఐడియా? జపాన్‌లోని హిపొపొ పాపా కేఫ్‌ hipopo papa […]

  • Publish Date - June 29, 2023 / 10:10 AM IST

A Toilet In Fish Tank |

నీళ్లతొట్టి మ‌ధ్యలో పాయ‌ఖానా క‌ట్టిన జ‌పాన్ హోట‌ల్‌

విధాత: జ‌పాన్ వాళ్లకి సాధార‌ణంగానే వింత ఆలోచ‌న‌లు, వింత ఉత్పత్తులు కొత్త కాదు. అయితే ఈ మ‌ధ్య ఓ హోట‌ల్ వాళ్లకి బీభ‌త్సమైన ఐడియా వచ్చింది. చుట్టూ నీళ్లు, అందులో అంద‌మైన చేప‌లు, స‌ముద్రం లోప‌లి చెట్లూచేమ‌లు.. మ‌ధ్యలో గాజుతో నిర్మించిన ఒక అంద‌మైన పాయ‌ఖాన‌ (lavatory). ఎలా ఉంది ఐడియా?

జపాన్‌లోని హిపొపొ పాపా కేఫ్‌ hipopo papa café లో ఈ వెరైటీ టాయిలెట్‌ను నిర్మించారు. అన‌కూడ‌దు కానీ, చాలా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు. లోపలికి వెళ్లిన‌వారు “అస‌లు ప‌ని” మ‌ర్చిపోయి, చుట్టూ చూస్తూ మైమ‌ర‌చి పోతున్నార‌ట‌. దీంతో బ‌య‌ట చాంతాడంత క్యూ పెరిగి త‌లుపులు ద‌బాద‌బా బాదేస్తున్నార‌ని హోట‌ల్ య‌జ‌మానులు త‌ల‌లు బాదుకుంటున్నారు.

ప‌రిస్థితి పూర్తిగా దిగ‌జారి పోయి, ఏ క్షణ‌మైనా ఏమైనా జ‌రిగే ప‌రిస్థితి ఉన్నవాళ్లయితే మ‌రీ ఘోరం. ఆ టైమ్‌లో ఆస్తులు రాసిమ్మన్నా ఇస్తారు క‌దా మ‌రి. కానీ లోప‌లఉన్నవాళ్లను కూడా ఏమ‌నేట‌ట్టు లేదు. అందులోకి అడుగు పెట్టిన మ‌రుక్షణం అంద‌రూ మ‌త్స్యక‌న్యల్లా (అన్నట్లు ఇది ఆడ‌వాళ్ల కోస‌మేన‌ట‌.. మ‌రీ ఖాళీగా ఉంటే, సిబ్బందితో పాటు మ‌గ‌వాళ్లను కూడా అనుమ‌తిస్తార‌ట‌) మారిపోతున్నమాట వాస్తవం.

చుట్టూ అంద‌మైన జ‌ల‌చ‌రాలు, ప‌గ‌డ‌పు రాళ్లు, ముత్యపుచిప్పలు, చిన్నచిన్న స‌ముద్రపు మొక్కలు.. ఇలా ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన దృశ్యాలు క‌న‌బ‌డుతుంటే ఎవ‌రు మాత్రం బ‌య‌ట‌కెందుకొస్తారు? గ‌తేడాది తొలిసారిగా సామాజిక మాధ్యమాల‌లో ద‌ర్శనమిచ్చిన ఈ టాయిలెట్ చూప‌రులను విప‌రీతంగా ఆక‌ర్షించింది.

ల‌క్షల‌ కొద్దీ లైకులు, షేర్లతో సోష‌ల్‌ మీడియాను ఒక ఊపు ఊపేసింది. దీని అసాధార‌ణ‌మైన డిజైన్‌, అద్భుత‌మైన ప‌నితీరు, మాన‌వ‌ జిజ్ఞాస‌కు human fascination ఒక నిద‌ర్శనంలా అనిపిస్తోంద‌ని ఒక వినియోగ‌దారుడు కామెంట్ చేసాడు. ఇంకొక‌త‌ను అన్ని జ‌త‌ల చేప క‌ళ్లు న‌న్ను చూస్తుంటే ఇబ్బందిగా అనిపించి ‘వ‌చ్చిన ప‌ని’ స‌రిగ్గా పూర్తి చేయ‌లేక‌ పోయాను అని జోకేసాడు.

ఒక మామూలు నిర్మాణానికి, హ‌ద్దులులేని సృజ‌నాత్మక‌త‌ను, క‌ళాత్మక‌త‌ను జోడిస్తే అది ఎలాంటి క‌ళాఖండంగా రూపుదిద్దుకుంటుందో అన‌డానికి ప్రత్యక్ష ఉదాహ‌ర‌ణ ఈ రెస్ట్‌ రూమ్‌. ఈ సారి జ‌పాన్ వెళ్లిన‌పుడు త‌ప్పకుండా ఈ టాయిలెట్‌ను చూసి ( త‌ప్పద‌నుకుంటే వాడి ) రండి. మ‌ర్చిపోకండేం.

Latest News