Site icon vidhaatha

Saidabad: రూపాయికే జ‌త బ‌ట్ట‌లు.. బంపర్ ఆఫర్ దెబ్బ! దుకాణం బంద్

Saidabad |

విధాత: హైదరాబాద్ లో ఓ బట్టల దుకాణం యజమాని ఇచ్చిన బంపర్ ఆఫర్ దెబ్బకు దుకాణమే మూసుకోవాల్సి న విచిత్ర పరిస్థితికి దారితీసింది. సైదాబాద్ (Saidabad) ఏఎస్ ట్రెండింగ్ ఫ్యాషన్ దుకాణం యజమాని తన దుకాణం వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం రూ.1కే ఫ్యాంట్, షర్ట్ అంటూ ఆఫర్ ప్రకటించాడు.

ఈ బంపర్ ఆఫర్ విషయం తెలుసుకున్న యువకులు భారీ సంఖ్యలో ఏఎస్ ట్రెండింగ్ షాపు వద్ధకు చేరుకుని ఆఫర్ కోసం ఎగబడ్డారు. పరస్పరం తోపులాటకు దిగారు. వారిని అదుపు చేయడం దుకాణం నిర్వాహకుల వల్ల కాలేదు. దీంతో తోపులాటలో తొక్కిసలాటగా మారే ప్రమాదముండటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు రంగప్రవేశం చేసి వచ్చిన జనాన్ని అదుపు చేసేందుకు లాఠీలకు పని చెప్పారు. అయినా లాభం లేకపోవడంతో దుకాణం మూసివేయించారు. దీంతో ఆఫర్ కోసం ఆశపడి వచ్చిన జనం ఊసురుమంటు నిరాశతో వెనుతిరిగిపోయారు. అంతకుముందు కొందరు యువకులు మాత్రం రూ.1ఫ్యాంట్, షర్ట్ ఆఫర్ దక్కించుకుని సంతోషంగా వెళ్లారు.

Exit mobile version