ఆపిల్‌ ఐఫోన్‌-12పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌..! ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ కొని ఉండరు..!

  • Publish Date - October 29, 2023 / 04:55 AM IST

ఆపిల్‌ కంపెనీ ఈ ఏడాది ఐఫోన్‌-15 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. దాంతో కొత్త మోడల్స్‌కు మార్కెట్‌లో భారీగా డిమాండ్‌ పెరిగింది. అదే సమయంలో పాత మోడల్స్‌పై క్రేజ్‌ తగ్గింది. ఈ క్రమంలో ఐఫోన్‌-14, ఐఫోన్‌-13, ఐఫోన్‌-12 సిరీస్‌ మొబైల్స్‌ ధర విపరీతంగా పెడిపోయింది. అయితే, ఐఫోన్‌-12 మోడల్‌ ధర ఇంతకుముందెన్నడూ లేనంత ధరకే దొరుకుతున్నది. మార్కెట్‌లో ఆపిల్‌ మొబైల్స్‌కు భారీగా డిమాండ్‌ ఉంటుంది. ఐఫోన్‌ను స్టేటస్‌ సింబల్‌గా తీసుకుంటున్నారు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్‌-15 సిరీస్‌లోని మొబైల్‌ ధరలు రూ.లక్షకుపైగానే పలుకుతున్నాయి.


దీంతో ప్రస్తుతం అందరూ పాత మోడల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌-12పై భారీగా డిస్కౌంట్‌ ఇస్తున్నది. 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ మోడల్‌పై 18శాతం డిస్కౌంట్‌తో రూ.44,999 లభిస్తున్నది. వాస్తవానికి ఈ మొబైల్‌ ధర రూ.54,900గా ఉన్నది. డిస్కౌంట్‌కు తోడుగా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌, బ్యాంక్‌ డిస్కౌంట్‌, ఏదైనా ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసినా మరింత ధర తగ్గనున్నది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో మొబైల్‌ను కొనుగోలు చేస్తే అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వర్తించనున్నది.


ఐఫోన్‌-12 ఫీచర్స్‌ విషయానికి వస్తే..


ఐఫోన్ 12లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.1 ఇంచెస్‌ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్‌ బ్యాక్‌ సౌడ్‌లో 12 ఎంపీ డ్యూయల్-లెన్స్ సిస్టమ్, 12 ఎంపీ ట్రై డెప్త్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. A14 బయోనిక్ చిప్‌తో పాటు నెక్స్ట్ జనరేషన్ న్యూరల్ ఇంజిన్‌ ప్రాసెసర్‌తో వస్తుంది. సిరామిక్ షీల్డ్ టెక్నాలజీ, ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్ ఫోన్. ఇందులో డాల్బీ విజన్‌తో 30 ఎఫ్పీఎస్ వరకు హెచ్ డీఆర్ వీడియో రికార్డింగ్, 30 ఎఫ్పీఎస్.. 60 ఎఫ్పీఎస్ వద్ద 1080పీ హెచ్‌డీ వీడియో రికార్డింగ్, 120 ఎఫ్పీఎస్ వద్ద 1080 పీ కోసం స్లో-మోషన్ వీడియో సపోర్ట్, నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్, క్విక్‌టేక్ వీడియో, అనిమోజీ, మెమోజీతో పాటు పలు ఫీచర్స్‌ ఉన్నాయి. మరి మీరు కూడా ఐఫోన్‌ కొనాలకుంటే త్వరపడండి మరి..!

Latest News