2026లో ఆపిల్ దూకుడు మామూలుగా లేదుగా : 15కు పైగా కొత్త ఉత్పత్తులు

2026లో ఆపిల్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. iPhone 18 Pro, ఫోల్డబుల్ ఐఫోన్, M5 మ్యాక్‌లు, స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు, Apple Intelligenceతో టెక్ ప్రపంచంలో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది.

2026లో ఆపిల్ దూకుడు మామూలుగా లేదుగా : 15కు పైగా కొత్త ఉత్పత్తులు ఐఫోన్ నుంచి వాచ్ వరకు – ఆపిల్ పూర్తి ఎకోసిస్టమ్

Apple 2026 Mega Launch: 15+ New Products, Foldable iPhone, AI Revolution Begins

ఆపిల్ 2026 హైలైట్స్

  • 15కిపైగా కొత్త ఉత్పత్తులతో భారీ లాంచ్ ప్లాన్
  • ఫోల్డబుల్ ఐఫోన్ – ఆపిల్ నుంచి తొలి ప్రయోగం
  • Apple Intelligence తో పూర్తి ఎకోసిస్టమ్ మార్పు
  • M5 మ్యాక్‌లతో AI పనితీరు పెరుగుదల
  • స్మార్ట్ హోమ్ మార్కెట్‌పై ఆపిల్ దృష్టి
  • కొత్త Siriతో ఇంటి నుంచి ఫోన్ వరకు పూర్తి AI కనెక్టివిటీ
  • Apple Glasses వంటి భవిష్యత్ ఉత్పత్తులతో కొత్త మార్కెట్లపై దృష్టి

విధాత టెక్​ డెస్క్​ | హైదరాబాద్​:

Apple 2026 | 2026లో ఆపిల్ భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 15కిపైగా కొత్త ఉత్పత్తులు ఈ ఏడాది చివరి వరకు విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజా లీకులు చెబుతున్నాయి. ఐఫోన్​ అల్ట్రా(ఫోల్డబుల్ ఐఫోన్) నుంచి స్మార్ట్ గ్లాసెస్ వరకు, స్మార్ట్ హోమ్ ఉపకరణాల నుంచి పవర్‌ఫుల్ మ్యాక్‌ల వరకు—టెక్ ప్రపంచంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనుంది.

మార్క్ గుర్మన్, మ్యాక్‌రూమర్స్, 9టు5మ్యాక్ వంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఉత్పత్తులన్నీ Apple Intelligence (AI) చుట్టూనే తిరగబోతున్నాయి.

ఐఫోన్ 18 లైనప్: ప్రీమియం మోడల్స్‌పై పూర్తి ఫోకస్

Apple iPhone 18 Pro and Pro Max models in burgundy, gold and purple color options

iPhone 18 Pro సిరీస్ – కొత్త కలర్స్‌తో ప్రీమియం లుక్

ఈసారి సాధారణ ఐఫోన్​ 18 మోడల్ ఆలస్యం అవుతుందని సమాచారం. దాంతో సెప్టెంబర్ ఈవెంట్‌లో ప్రీమియం మోడల్స్‌కే ప్రాధాన్యం దక్కనుంది. ముఖ్యంగా ఐఫోన్​ 18 ప్రొ, ఐఫోన్​ 18 ప్రొ మ్యాక్స్మోడల్స్‌లో డిజైన్, కెమెరా, పనితీరు—ఇలా అన్నిరకాల అప్‌గ్రేడ్‌లు కనిపించనున్నాయి. చిన్న డైనమిక్​ ఐలండ్​ లేదా అండర్-డిస్‌ప్లే ఫేస్​ ఐడీ, వేరియబుల్​ అపెర్చర్​ కెమెరా, పెద్ద బ్యాటరీ, A20 ప్రొ చిప్, ఆపిల్​ స్వంత C2 మోడెమ్ వంటి సౌలభ్యాలు రావొచ్చు.

ఈ లైన్‌ప్‌లోనే పెద్ద హైలైట్‌గా నిలిచేది ఐఫోన్​ అల్ట్రా(iPhone Ultra). పుస్తకం లాగా మడిచే ఈ ఫోన్‌లో బయట చిన్న స్క్రీన్, లోపల పెద్ద తెర ఉండే అవకాశం ఉంది. అత్యంత సన్నగా ఉండే డిజైన్, టైటానియం హింజ్, డ్యూయల్ కెమెరాలు, టచ్ ఐడీ వంటి ఫీచర్లతో ఇది ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తోంది. ధర కూడా ₹2 లక్షల దాకా ఉండొచ్చని అంచనా. అయితే లాంచ్ టైమ్‌పై ఇంకా కొంత అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఫోన్​ డిజైన్​ కూడా కొంక విచిత్రంగా ఉంది. సామ్​సంగ్​ జెడ్​ ఫోల్డ్​లా కాకుండా, ఓపెన్​ చేస్తే చిన్న ఐప్యాడ్​లా ఉండబోతోంది. ఆపరేషన్​ కూడా ఐప్యాడ్​లానే ఉంటుందని భోగట్టా.

 వేరబుల్స్: స్థిరమైన అప్‌డేట్స్, AI ఇంటిగ్రేషన్

Apple AirPods Pro and smart glasses concept showing future AI wearable devices

ఎయిర్‌పాడ్స్, స్మార్ట్ గ్లాసెస్ – ఆపిల్ AI వేర్‌బుల్స్ భవిష్యత్తు

Apple Watch Series and Ultra models showing new design and health features

ఆపిల్ వాచ్ సిరీస్, అల్ట్రా – హెల్త్ ఫీచర్లలో మెరుగుదల

వేర్‌బుల్స్ విభాగంలో ఆపిల్​ వాచ్​ సిరీస్​ 12, వాచ్​ అల్ట్రా 4 మోడల్స్ రావొచ్చని సమాచారం. డిజైన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, పనితీరు మెరుగుదలలు, కొత్త హెల్త్ సెన్సార్లు, ఇంకా ఆపిల్​ ఇంటెలిజెన్స్​తో రానున్నాయి.

అదే సమయంలో కొత్తగా రానున్న ఎయిర్​పాడ్స్​ ప్రొ (నెక్స్ట్​ జెన్​) మోడల్‌లో AI ఆధారిత ఫీచర్లు, మెరుగైన ఆడియో అనుభవం ఉండొచ్చని అంచనా. IR కెమెరాల వంటి ఫీచర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, అవి ఈ ఏడాదే వస్తాయా అన్నది ఇంకా స్పష్టంగా లేదు.

Apple Glasses: భవిష్యత్తు టెక్నాలజీకి ముందడుగు

భవిష్యత్తు ప్రాజెక్ట్‌గా Apple Glasses పనిచేస్తోంది. తేలికపాటి డిజైన్, కెమెరా, స్పీకర్లు, మైక్రోఫోన్, మరియు AI ఆధారిత Siri ఇంటరాక్షన్‌తో ఇవి రూపొందుతున్నాయి. 2026లో ఒక టీజర్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి విడుదల 2027లోనే జరగవచ్చని అంచనా.

మ్యాక్ ఉత్పత్తులు: AI కోసం శక్తివంతమైన కంప్యూటర్లు

Apple M5 Mac lineup including MacBook, iMac and Mac Studio with AI performance

M5 చిప్‌తో మ్యాక్‌లు – AI పనితీరులో కొత్త దశ

2026లో మ్యాక్ విభాగం ఆపిల్‌కు కీలకం. ఎం5 మ్యాక్మినీ, మ్యాక్​ స్టుడియో(ఎం5 మ్యాక్స్​/అల్ట్రా), ఎం5 ఐమ్యాక్​ మోడల్స్‌లో కొత్త ఎం5 చిప్స్‌తో పనితీరు గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా AI ప్రాసెసింగ్ కోసం ఈ చిప్స్‌ను ఆప్టిమైజ్ చేస్తున్నారు.

ఇక చాలాకాలంగా ఎదురుచూస్తున్న మ్యాక్​బుక్​ ప్రొ(ఎం6) మోడల్‌లో OLED డిస్‌ప్లే, టచ్ సపోర్ట్ వంటి ఫీచర్లు రావొచ్చని వార్తలు ఉన్నప్పటికీ, ఇది 2026లో కాకుండా 2027కి వెళ్లే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

📲 ఐప్యాడ్ అప్‌డేట్స్: AI యుగానికి సిద్ధం

Apple iPad and iPad mini 2026 models with updated display and interface

కొత్త ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ – డిస్ప్లేలో అప్‌గ్రేడ్

కొత్తగా వచ్చే iPad (12th generation) మరియు iPad mini (8th generation) మోడల్స్‌లో ప్రధానంగా Apple Intelligence సపోర్ట్ ఉంటుంది. iPad miniలో OLED డిస్‌ప్లే, ProMotion వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉండటం ఈ సెగ్మెంట్‌లో ముఖ్యమైన అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు.

🏠 స్మార్ట్ హోమ్ ఉత్పత్తులు: ఆపిల్ కొత్త దిశ

Apple HomePod and smart display device concept with video calling interface

ఆపిల్ హోమ్‌పాడ్, స్మార్ట్ డిస్ప్లే – ఇంటి నియంత్రణకు కొత్త హబ్

స్మార్ట్ హోమ్ విభాగంలో ఆపిల్ కొత్తగా దూసుకెళ్తోంది. కొత్తగా వచ్చే ఆపిల్​ టీవీ 4కె(నెక్స్ట్​ జెన్​), హోమ్​పాడ్​(3వ తరం​) హోమ్​పాడ్​ మినీ(2వ తరం), మోడల్స్‌తో పాటు, ప్రత్యేకంగా ఆపిల్​ హోమ్​ప్యాడ్​(Apple HomePad) అనే స్మార్ట్ డిస్​ప్లే ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇది ఇంట్లోని అన్ని స్మార్ట్ ఉపకరణాలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో నియంత్రించే కేంద్రంగా పనిచేస్తుంది.

అదనంగా, Apple Security Camera, Video Doorbell వంటి ఉత్పత్తులు కూడా అభివృద్ధిలో ఉన్నాయని సమాచారం.

2026 – ఆపిల్‌కు పరీక్షా కాలం, కొత్త ప్రారంభం

మొత్తంగా చూస్తే, 2026లో ఆపిల్ తీసుకుంటున్న అడుగులు చిన్నవి కావు. ఫోల్డబుల్ మార్కెట్‌లో కొత్త ఎంట్రీ, AIలో గూగుల్-మైక్రోసాఫ్ట్‌లతో పోటీ, స్మార్ట్ హోమ్ రంగంలో విస్తరణ—ఇవి అన్నీ కలిసి కంపెనీకి పెద్ద సవాళ్లు విసురుతున్నాయి.