Sankranthiki Vasthunnam: క్రియేటివిటీ పీక్స్‌.. రిలీజ్‌కు ముందే హిట్‌టాక్‌

విధాత‌: విక్ట‌రీ వెంక‌టేశ్‌ (Venkatesh), అనీల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ముచ్చ‌ట‌గా వ‌స్తోన్న మూడ‌వ‌ చిత్రం ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ( Sankranthiki Vasthunnam). దిల్ రాజు (Dil Raju), శిరీష్ ఈ మూవీని నిర్మించ‌గా మీనాక్షి చౌద‌రి (Meenakshi Chowdary), ఐశ్వ‌ర్య రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డం, పోటీగా గేమ్ ఛేంజ‌ర్‌, డీకు మ‌హారాజ్ వంటి రెండు పెద్ద చిత్రాల విడుద‌ల నేపథ్యంలో ఈ మూవీ […]

విధాత‌: విక్ట‌రీ వెంక‌టేశ్‌ (Venkatesh), అనీల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ముచ్చ‌ట‌గా వ‌స్తోన్న మూడ‌వ‌ చిత్రం ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ( Sankranthiki Vasthunnam). దిల్ రాజు (Dil Raju), శిరీష్ ఈ మూవీని నిర్మించ‌గా మీనాక్షి చౌద‌రి (Meenakshi Chowdary), ఐశ్వ‌ర్య రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డం, పోటీగా గేమ్ ఛేంజ‌ర్‌, డీకు మ‌హారాజ్ వంటి రెండు పెద్ద చిత్రాల విడుద‌ల నేపథ్యంలో ఈ మూవీ మేక‌ర్స్, డైరెక్ట‌ర్ అనీల్ వినూత్నంగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు.

ఇప్ప‌టికే కాకినాడ‌లో వేలాది మంది మ‌ధ్య ఓ కార్య‌క్ర‌మం చేప‌ట్టి సంద‌డి చేసిన చిత్ర యూనిట్ ఇటీవ‌ల‌ నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని మ‌రో అడుగు ముందుకేసి. వెంక‌టేశ్ ఆల్ టైం చిత్రాల టైల‌ర్‌మేడ్ క్యారెక్ట‌ర్లు బొబ్బిలి రాజా గెట‌ప్‌లో మీనాక్షి చౌద‌రి, చంటి వేష‌ధార‌ణ‌లో ఐశ్వ‌ర్య‌, జ‌యం మ‌న‌దేరా లుక్‌లో అనీల్ రావిపూడి, ఘ‌ర్ష‌ణ గెట‌ప్‌లో దిల్ రాజులు ఎంట్రీ ఇచ్చి వెంకీని ఇంట‌ర్వ్యూ చేశారు. ఇది సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది.

దీంతో పోటీగా రెండు భారీ చిత్రాలున్నా ఆడియెన్స్‌లో క్రేజ్ ద‌క్కించుకోవ‌డంలో స‌క్సెస్ అయి రిలీజ్‌కు ముందే హిట్ టాక్ తెచ్చుకోగ‌లిగింది. అంతేకాదు ఇటీవ‌ల ఆంధ్ర‌లో స్పెష‌ల్‌గా అభిమానుల‌తో ఫొటో సెష‌న్ నిర్వ‌హించి కిలోమీట‌ర్ల‌ మేర క్యూలో నిల‌బ‌డి ఉన్న అభిమానులంద‌రికీ ఎంతో ఓపిక‌గా ఫోటోలు దిగి ఔరా అనిపించారు. తాజాగా సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను మ‌హేశ్‌బాబు చేతుల‌మీదుగా విడుద‌ల చేసి సినిమాపై హైప్స్ మ‌రింత‌గా పెంచారు.

 

Latest News