Site icon vidhaatha

Vijayashanti | కవిత.. అరెస్టు కోరుకోవడం లేదు: విజయశాంతి

Vijayashanti

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీస్ లు ఇవ్వడంపై బీజేపీ నేత విజయశాంతి చేసిన ట్వీట్ పోలిటికల్ సర్కిల్ లో వైరల్‌గా మారింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టును తాను కోరుకోవడం లేదంటూ విజయశాంతి ట్వీట్లో పేర్కోనడం చర్చనీయాంశమైంది. ట్వీట్ లోకి వెళితే ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు… ఆ ఆవశ్యకత కూడా లేదన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయన్నారు.

ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే.. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అన్న భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ… జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదన్నారు

. గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు బీఆరెస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నదన్నారు. ఇక, ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు.. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎన్నటికీ కోరుకుంటది అని ట్వీట్ చేశారు

Exit mobile version