Vishal:తమిళ స్టార్ హీరో విశాల్ కు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల అతడి ఆరోగ్యం బాగాలేదంటూ అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే తాజాగా విశాల్ పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ అయింది. ఓ ప్రముఖ నటితో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
విశాల్ పెళ్లి గురంచి దశాబ్ద కాలంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ వ్యాపారవేత్త కూతురితో నిశ్చితార్ధం జరిగి పెళ్లి క్యాన్సిల్ అవడం అప్పట్లో పెత్త చర్చనీయాంశం అయింది. ఆపై పలువురు హీరోయిన్లతో ఆయన ప్రేమలో ఉన్నాడన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. గతంలో బయటకు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలు గానే మిగిలిపోయాయి. దీంతో తాజాగా ఈ వార్తలన్నింటికీ చెక్ పెడింది.
కబాలీ ఫేమ్ సాయి ధన్సిక ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు సమాచారం. విశాల్ ఇటీవలే పెళ్లి గురించి స్పందించాడు. తాను త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నానని చెప్పాడు. అయితే సోమవారం రాత్వి ధన్షిక ప్రధాన పాత్రలో నటించిన ఓ తమిళ చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్ లో ధన్షిక స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగష్టు 29న పెల్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించేసింది.