విధాత: భారత్ పాక్ ల మధ్య అమెరికా మధ్య వర్తిత్వముతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కు పాకిస్తాన్ మూడు గంటల్లోనే తూట్లు పొడిచింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పార్క్ సరిహద్దుల్లో కాల్పులు డ్రోన్లు మిసైల్స్ తో దాడులకు దిగబడింది పార్టీలరీ గన్స్ డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేస్తుంది. జమ్ము కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి. దీంతో జమ్మూ, శ్రీనగ ర్, ఫిరోజ్పూర్, హోషాపూర్, ఉదంపూర్, జై సల్మేర్లలో బ్లాక్ అవుట్ ప్రకటించారు. సరిహద్దుల్లో పాక్ కాల్పుల్లో బిఎస్ఎఫ్ ఎస్ఐ ఎండి ఇంతియాజ్ వీరమరణం పొందారు
ఎల్ఓసి పాకిస్తాన్ దళాలు జరుగుతున్న కాల్పులను భారత్ బిఎస్ఎఫ్ దళాలు తిప్పి కొడుతున్నాయి. భారత సైనిక పోస్టుల లక్ష్యంగా పాక్ కొనసాగిస్తుంది. పాక్ వక్రబుద్ధితో కాల్పుల విరమణ ఉలంగన కు పాల్పడడంతో తాజా పరిణామాలపై ప్రధాని మోడీ ఢిల్లీలో హై లెవెల్ కమిటీ భేటీ నిర్వహిస్తున్నారు. సైనానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ పాక్ దాడులను తిప్పి కొట్టాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. పాక్ గగనతల దాడులను భారత డిఫెన్స్ సిస్టంతో అడ్డుకుంటుంది . పరిస్థితి మళ్లీ ఉదృతగా మారడంతో భారత్ కూడా తగిన రీతిలో స్పందించేందుకు సన్నద్ధం అవుతుంది.