Site icon vidhaatha

Rasi Phalalu: Feb18, మంగ‌ళ‌వారం.. నేటి మీరాశి ఫలాలు! వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి

Rasi Phalalu| జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం ఉంది. లేచినప్ప‌టి నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం
రుణప్రయత్నాలు స‌ఫలం. కుటుంబ పరిస్థితుల వ‌ళ్ల ఆసంతృప్తి, మానసిక ఆందోళన. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు. బంధు, మిత్రులతో వైరం అవ‌కాశం. పదోన్నతి సూచనలు. కొత్త పెట్టుబడులు పెడతారు. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి.

వృషభం
త్వ‌ర‌గా రుణప్రయత్నాలు. స్థానచలన సూచనలు. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికం. అధిక ప్రయాణాలు. అరోగ్యం విష‌యంలో జాగ్రత్త అవసరం. మొహమాటం లేకుండా ఉండాలి. మీ మంచితనం కొన్ని సంద‌ర్భాల్లో మిమ్మల్ని కాపాడుతుంది. కలహాలకు ఆస్కారం.

మిథునం
పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి. పిల్లల విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు ఉంటాయి. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. మనోల్లాసాన్ని ఉంటుంది. స్వల్ప అనారోగ్య బాధలు త‌ప్ప‌వు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ప‌లు అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

 

కర్కాటకం
ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలం. కుటుంబ పరిస్థితుల వ‌ళ్ల‌ మానసిక ఆందోళన. ప్రతి పని ఆలస్యం. వృత్తిలో అజాగ్రత్తగా ఉండ‌రాదు. విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. బుద్ధిబలంతో లక్ష్యాలను సాధిస్తారు.

 

సింహం
తలచిన కార్యాలకు ఆటంకాలు. స్థిరాస్తుల వివాదాల విష‌యంలో అజాగ్రత్త ప‌నికి రాదు. ఇత‌రులో మోసపోయే అవకాశాలు. ఆందోళనకరంగా ఆర్థిక పరిస్థితి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండ‌డం మంచిది.. అధిక ప్రయాణాలు. వ్యాపారంలో కలిసొస్తుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి.

 

కన్య
తరచూ ప్రయాణాలు. అకాల భోజనం వల్ల అనారోగ్యం. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన. వృత్తిరీత్యా అజాగ్రత్తగా ఉండ కూడ‌దు. ఓపిక‌తో ఉండాలి. ఆవేశం వల్ల పనులు చెడిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరమైన ఫలితాలు

తుల
ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. బంధు మిత్రులతో విరోధం. స్త్రీల మూలకంగా శతృబాధలు. ఓ విషయంతో మనస్తాపం. పిల్లల విష‌యంలో స‌డ‌లింపు ఉండాలి. పగ ప్ర‌తీకారాలు ప‌నికి రావు. నలుగురినీ కలుపుకుని వెళ్లండి. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారయోగం ఉంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు.

 

వృశ్చికం
నూతన కార్యాలకు రూపకల్పన. ఆటంకాలు తొలగుతాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆకస్మిక ధనలాభం. సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాలు. శుభవార్తలు వింటారు. మనోల్లాసం ఉంటుంది. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అపాత్రదానం వద్దు. వివాదాల జోలికి వెళ్లొద్దు.

ధనుస్సు
సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. చాలా విష‌యాల్లో ఓపిక వ‌హించాలి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ధనవ్యయం, రుణప్రయత్నాలు. అనారోగ్య బాధలు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. పనులు ఓ కొలిక్కి వస్తాయి.

మకరం
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో జాగ్ర‌త్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు, రుణప్రయత్నాలు. ఆలస్యంగా బంధు, మిత్రుల సాయం. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. పని ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

 

కుంభం
బంధు, మిత్రులతో విరోధం అవ‌కాశం. అనారోగ్య స‌మ‌స్య‌లు అంత‌గా ఉండ‌వు. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప అనారోగ్య బాధలు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో వృద్ధి . మానసిక ఆందోళన. పనులు పూర్తి చేసుకోలేకపోతారు. ఆర్థిక ఫలితాలు అనుకూలం. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రుల సహకారం అందుతుంది.

మీనం
అనవసరభయాందోళనలు తొలుగుతాయి. ప్రయాణాల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలనం. ఆర్థిక పరిస్థితిలో మార్పులు. రుణ ప్రయత్నాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. వ్యాపారం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. ప్రతిభతో పెద్దల్ని మెప్పిస్తారు. ధన, ధాన్య యోగాలు ఉన్నాయి.

Exit mobile version