Site icon vidhaatha

 హసన్‌లో సెక్స్‌ స్కాండల్‌ నిందితుడు .. ప్రజ్వల్‌ ఓటమి

బెంగళూరు: కర్ణాటకలోని హసన్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేసిన జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణ దారుణ పరాజయం పొందారు. తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి
శ్రేయాస్‌ ఎం పటేల్‌ చేతిలో సుమారు 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వందలమంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఆయన జర్మనీకి పరారయ్యారు. రెండు రోజుల క్రితం కర్ణాటకకు వచ్చిన ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ కోసం ప్రధాని మోదీ ప్రచారం చేసినా హసన్‌ నియోజకవర్గ ప్రజలు ఆయనను తిరస్కరించారు.

Exit mobile version