- నగరిలో అధికార, ప్రతిపక్షాల సవాళ్లు
- గాలిపై రోజా ఫిర్యాదు
- గతంలో రోజా చేసిన విమర్శల వీడియోల రిలీజ్
అమరావతి: ఏపీలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే.రోజాకు.. నగరి నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కు మధ్య మాటల యుద్దం ముదిరింది. రోజా 2 వేలు ఇస్తే ఏ పనైనా చేసేదని..మార్కెట్ లో ఆ మాట ఉందని…అలాంటామే 2వేలకోట్లకు ఎదిగిందని, ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ..ఇప్పుడేదో రోడ్డు గురించి మాట్లాడుతుందని.. అదే రోడ్డు అక్కడ ఉంటే నీవు దానిపై దొర్లుతావా అని భాను ప్రకాష్ విమర్శలు చేశారు. ఈ పిచ్చి దానితో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పుత్తూరు కోర్టు వద్ద రోజా మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ పై పలు విమర్శలు చేశారు. గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ అని..ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని రోజా విమర్శించారు. భాను ప్రకాష్ కౌన్సిలర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నారు. నగరి నియోజకవర్గం అక్రమ మైనింగ్, గంజాయికి అడ్డగా మారిందని..భాను ప్రకాష్ చేసిన అక్రమాలు బయటకు తీస్తానని.. అవినీతి బయటకు కక్కిస్తానంటూ ఫైర్ అయ్యారు.
తనపై రోజా చేసిన విమర్శలకు ప్రతిగా ఎమ్మెల్యే భానుప్రకాష్ సైతం ఆమెపై అనుచిత పదజాలంతో విరుచుక పడ్డారు. వారిద్ధరి మధ్య సాగిన విమర్శల పర్వం ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపింది. మరోవైపు తన మాటలపై రచ్చ చేస్తున్న మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వరుస వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు , లోకేష్, పవన్ కల్యాణ్ లను ఉద్దేశించి రోజా చేసిన అసభ్యకర వ్యాఖ్యల వీడియోలను ఆయన రిలీజ్ చేశారు. ఇదేనా డిగ్నిటీ అంటే అని రోజాను ప్రశ్నించారు. దీంతో వారి మధ్య విమర్శల పర్వం మరింత తీవ్రతరమైంది.
భానుప్రకాష్ పై రోజా ఫిర్యాదు
మహిళనైన తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి ఆర్కే. రోజా జాతీయ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. అంతకుముందు.. భాను ప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలని చిత్తూరు జిల్లా నగరి పోలీస్ స్టేషన్‌లో రోజా ఫిర్యాదు చేశారు. అయితే తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించక పోవడం పట్ల రోజా ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తనపై భాను ప్రకాష్ చేసిన విమర్శల పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు స్పందించి చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడిగా భానుప్రకాష్ మాటలు ఉన్నాయని రోజా పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.