• వైసీపీలో ఉన్న లుకలుకలు, అంతర్గత విబేధాలకు చంద్రబాబుకి ఏమిటి సంబంధం?
• రఘురామకృష్ణంరాజుకి ఎంపీ టిక్కెట్ ఇవ్వమని చంద్రబాబు జగన్ తోచెప్పాడా?
• రఘురామకృష్ణంరాజు అరెస్ట్ తో , ఆయనప్రాణాలకు హాని ఉందని కుటుంబసభ్యులు వాపోతుంటే, దాన్ని చంద్రబాబుకి అంటగడతారా?
• వైసీపీఎంపీలు అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే, వారి భార్యాపిల్లలు విలపించరా?
• ఆమాత్రం కూడా ఇంగితంలేకుండా అన్నింటికీ చంద్రబాబుని అంటారేమిటి?
• అచ్చెన్నాయుడు, రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమాల అరెస్ట్ లు సహా, టీడీపీ కార్యకర్తల అరెస్ట్ లు, హత్యలపై చంద్రబాబు రాష్ట్రపతికి లేఖరాయలేదా?
• పొద్దున్నలేస్తే చంద్రబాబు జపంచేయందే వైసీపీ నేతలు, మంత్రులు,ఎమ్మెల్యేలకునిద్ర పట్టడంలేదు.
• హత్యారాజకీయాలు, వేధింపులు, కక్షసాధింపులు, కులమతాల మధ్యచిచ్చులు చంద్రబాబుకి తెలియవు.
• ఆయనఎన్నడూ అలాచేసిన వ్యక్తికాడు.ఆవిషయం రాష్ట్రప్రజలకు తెలుసు. (టీడీపీ రాష్ట్రప్రధానకార్యదర్శి మరియు ఎమ్మెల్సీ) బుద్దా వెంకన్న వాపోయాడు.