Call Forwarding Service | దేశంలో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. యూఎస్‌ఎస్‌డీ ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ సర్వీసులను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఏప్రిల్ 15 నుంచి దేశంలో కాల్ ఫార్వార్డింగ్ సర్వీసులను నిలిపివేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ సూచించింది. యూఎస్ఎస్‌డీ ఆధారిత కాల్ ఫార్వార్డింగ్‌కు సంబంధించిన అన్ని లైసెన్సులు ఏప్రిల్ 15 నుంచి చెల్లుబాటు కావని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఆన్ లైన్ మోసాలను నిరోధించేందుకు ఆ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. యూఎస్‌ఎస్‌డీ అనేది ఓ ఫీచర్. దీని సహాయంతో ఓ నిర్ధిష్ట కోడ్ డయల్ చేయడం ద్వారా ఒకే నంబర్‌పై అనేక సేవలను యాక్టివేట్ చేసుకునేందుకు అవకాశం ఉండడంతో పాటు డీయాక్టివేట్‌కు సైతం అవకాశం ఉంటుంది
ఐఎంఈఐ నంబర్‌ను సైతం యూఎస్‌ఎస్‌డీ కోడ్ ద్వారానే గుర్తించే విషయం తెలిసిందే. కాల్ ఫార్వార్డింగ్ ఫీచర్ ద్వారా మీ నంబర్‌కు వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌ను సైతం ఇతర నంబర్లకు ఫార్వార్డ్ చేసే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసిన టెలీకాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. నెట్‌వర్క్‌లో ఇబ్బందులు ఉన్నట్లుగా గుర్తించామని.. సమస్య నుంచి బయటపడేందుకు యూఎస్‌ఎస్‌డీ కోడ్‌లను డయల్ చేయమని చెబుతూ.. సందేశాలను, ఫోన్‌కాల్స్ తమ నంబర్లకే వచ్చేలా చేస్తున్నారు. దాంతో మోసాలకు పాల్పడుతున్నారు. దాంతో బ్యాంకు ఓటీపీలను తెలుసుకొని ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. కాల్స్ ఫార్వర్డ్ ద్వారా మీ పేరుపై ఇతర సిమ్‌కార్డులను సైతం జారీ చేసేందుకు వీలుంటుంది.
Call Forwarding Service | కాల్ ఫార్వార్డింగ్ సర్వీసులను నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు కేంద్రం ఆదేశం..!
Call Forwarding Service | దేశంలో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. యూఎస్‌ఎస్‌డీ ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ సర్వీసులను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఏప్రిల్ 15 నుంచి దేశంలో కాల్ ఫార్వార్డింగ్ సర్వీసులను నిలిపివేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ సూచించింది. యూఎస్ఎస్‌డీ ఆధారిత కాల్ ఫార్వార్డింగ్‌కు సంబంధించిన అన్ని లైసెన్సులు ఏప్రిల్ 15 నుంచి చెల్లుబాటు కావని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఆన్ లైన్ మోసాలను నిరోధించేందుకు ఆ శాఖ ఈ […]

Latest News
18న మేడారంలో తెలంగాణ కేబినెట్.. రేవంత్ ఉద్దేశం ఇదేనా..?
విషాదం : నాటు బాంబు వల్ల ఏనుగు పిల్ల మృతి
ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!
అడవి ఏనుగుల ఉన్మాదం – ఇద్దరు రైతుల దారుణ మరణం
మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్ పొందొచ్చు..!
పుట్టగొడుగుల సాగుతో.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న ఒడిశా రైతు
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!
2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 2 కోట్ల 35 లక్షలు..!
మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల సునామీ : 5వ రోజునాటికి 150 కోట్లు