Site icon vidhaatha

బ్యాడ్మింటన్ ఆడుతూ.. కుప్పకూలిన చైనీస్ క్రిడాకారుడు

విధాత : ఇండోనేషియాలో జరిగిన బ్యాడ్మింటిన్ టోర్నీలో ఆడుతున్న చైనీస్ క్రిడాకారుడు జాంగ్ జీజీ(17) ఒక్కసారిగా గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలి మృతి చెందాడు. జాంగ్ జీజీ మరణానికి సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది. మ్యాచ్ ఆడుతున్న క్రమంలో జాంగ్ జీజీ అకస్మాత్తుగా పడిపోగా అతనికి ఏమైందన్న ఆతృతను సాటి ఆటగాడుగాని, సిబ్బందిగాని తొలుత కనబరుచలేదు. కొద్దిసేపటికి పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అప్పటికే జీజీ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన పెరుగుత్ను గుండెపోటు మరణాల తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. కోవిడ్ అనంతర కాలంలో ఈ తరహా మరణాల రేటు వయసుతో నిమిత్తం లేకుండా పెరుగడం ఆందోళన రేకెతిస్తుంది.

Exit mobile version