IND vs AFG| చెల‌రేగిన సూరీడు, నిప్పులు చెరిగిన బుమ్రా.. ఆఫ్ఘ‌న్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

IND vs AFG| లీగ్ మ్యాచ్‌ల‌లో అద‌ర‌గొట్టిన భార‌త్ ఇప్పుడు సూప‌ర్ 8లో కూడా అదే హ‌వా చూపిస్తుంది. గ‌త రాత్రి ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా .. ఆఫ్ఘనిస్తాన్‌పై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీ-20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అజేయంగా ఉంది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కె

  • Publish Date - June 21, 2024 / 06:42 AM IST

IND vs AFG| లీగ్ మ్యాచ్‌ల‌లో అద‌ర‌గొట్టిన భార‌త్ ఇప్పుడు సూప‌ర్ 8లో కూడా అదే హ‌వా చూపిస్తుంది. గ‌త రాత్రి ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా .. ఆఫ్ఘనిస్తాన్‌పై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీ-20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అజేయంగా ఉంది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ‌రోసారి రోహిత్‌, కోహ్లీ ఓపెనింగ్ దిగారు. వారిద్ద‌రు పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. ఫ‌స్ట్ డౌన్‌లో వ‌చ్చిన పంత్, ఆ త‌ర్వాత వ‌చ్చిన దూబే కూడా పెద్ద‌గా ప‌రుగులు రాబ‌ట్ట‌లేక‌పోయారు. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడ‌డంతో భార‌త్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది.

అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌కు భార‌త బౌల‌ర్స్ చుక్క‌లు చూపించారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/7), అర్ష్‌దీప్ సింగ్(3/36) నిప్పులు చెరిగే బంతులు వేసి ఇద్దరు చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఇక కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో అఫ్గాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(11) కీపర్ క్యాచ్‌గా పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. ఇక ఆ త‌ర్వాత ఇబ్రహీమ్ జడ్రాన్(8)ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. హజ్రతుల్లా జజై(2)ను బుమ్రా ఔట్ చేశాడు. ఈ స‌మ‌యంలో ఆఫ్ఘ‌న్ జ‌ట్టు 23 ప‌రుగుల‌కి మూడు వికెట్స్ కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డింది.

గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్ కాస్త నెమ్మ‌దిగా ఆడి 44 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడ‌దీసాడు. గుల్బాదిన్ నైబ్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి దెబ్బతీసాడు. ఆ త‌ర్వాత అజ్మతుల్లా ఒమ్జాయ్(20)ను జడేజా ఔట్ చేయగా.. నజిబుల్లా జడ్రాన్(19)ను బుమ్రా ఔట్ చేశాడు. ఇక సిక్స‌ర్‌తో విజృంభించిన నబీని 14 ప‌రుగులకి కుల్దీప్ ఔట్ చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్(2), నవీన్ ఉల్ హక్(0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఆఖరి బంతికి నూర్ అహ్మద్(12) ఔటవ్వడంతో భారత్ విజయం లాంఛనమైంది. ఆఫ్ఘన్ జట్టులో అజ్మతుల్లా ఓమ్జాయ్ అత్యధికంగా 26 పరుగులు చేశాడు.

Latest News