T20 WORLD CUP IND vs BAN బంగ్లాదేశ్‌‌పై భారీ విజయం.. సెమీస్ చేరిన టీమిండియా

భారీ స్కోరు భారత్​ను సెమీఫైనల్​ బెర్తును దగ్గర చేసింది. హార్థిక్​ పాండ్యా బ్యాటింగ్​, కుల్​దీప్​ బౌలింగ్​ బంగ్లాదేశీయుల భరతం పట్టింది. దీంతో సూపర్​ 8లో రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించి సెమీస్​కు అడుగు దూరంలో నిలిచింది. అధికారికంగా ప్రకటించలేనప్పటికీ, భారత్​ సెమీస్​కు చేరినట్లే.

  • Publish Date - June 22, 2024 / 11:49 PM IST

టి20 ప్రపంచకప్​ టోర్నీ(T20 Cricket World Cup 2024)లో ఇండియా(India) సెమీ ఫైనల్ దరికి చేరింది.  సూపర్​ 8 మ్యాచ్​లో బంగ్లాదేశ్(Bangladesh)​పై 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్​ గెలిచిన బంగ్లాదేశ్​ బౌలింగ్​ను ఎంచుకోవడంతో భారత్​ ధాటిగా బ్యాటింగ్​ మొదలుపెట్టింది. రోహిత్​(23), కోహ్లీ(37) ఇద్దరూ బ్యాట్లు విదిలించడంతో, స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే ఈ వేగం ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద తొలివికెట్​ రూపంలో రోహిత్​ వెనుదిరగగా, విరాట్​కు జత కలిసిన పంత్​ కూడా వేగంగా ఆడటంతో పరుగుల వేగం ఆగలేదు. కోహ్లీ, సూర్యకుమార్​ యాదవ్​ వెంటవెంటనే అవుటవడంతో, అప్పటికే క్రీజ్​లో ఉన్న శివమ్​ దూబే(34)కు జత కలిసిన హార్థిక్​ పాండ్యా(27 బంతుల్లో 50 పరుగులు‌‌– 4 ఫోర్లు, 3 సిక్సర్లు) Hardhik Pandya fast fifty మెరుపువేగంతో పరుగులు సాధించాడు. వీరిద్దరూ ఐదో వికెట్​కు విలువైన 53 పరుగులు జోడించారు. ఇక మరో వికెట్​ పడకుండా పాండ్యా ఇన్నింగ్స్​ను ముగించాడు. పవర్​ప్లేలో 50 పరుగులు సాధించిన ఇండియా, 11.2 ఓవర్లలో 100, 16.4 ఓవర్లలో 150 పరుగులు చేసింది.  దీంతో భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. India 196/5

బంగ్లా బౌలర్లలో టాంజిమ్​, రిషద్​ చెరో రెండు వికెట్లు తీయగా, షకీబ్​ ఒక వికెట్​ తీసుకున్నాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఏ దశలోనూ గమ్యంవైపు ప్రయాణించలేకపోయింది. అర్షదీప్​, బుమ్రాల పేస్​ను ఎదుర్కోవడానికి అష్టకష్టాలు పడ్డ బంగ్లా బ్యాటర్లు, అసహనంతో వికెట్లు పారేసుకున్నారు. ప్రమాదకరమైన లిటన్​దాస్​ను పాండ్యా పెవిలియన్​కు పంపగా, కుల్​దీప్​(Kuldeep Yadav) బంతులను గిరగిరా తిప్పడంతో ఎటూ అర్థంకానీ బ్యాటర్లు ముగ్గురు అతనికే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్​కు చేరుకున్నారు. ఒక్క శాంట్​ మాత్రమే ఒంటరి పోరాటం చేసి 40 పరుగులు సాధించగలిగాడు. 20 పరుగుల స్కోరు దాటింది శాంటోతో కలిపి ముగ్గురే. అప్పటికే రన్​రేట్​ చేతులు దాటడంతో బంగ్లా చేతులెత్తేసింది. 15.3 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన బంగ్లా 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీన్ని బట్టి పరుగులు రావడం ఎంత కష్టంగా మారిందో అర్థం అవుతుంది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్​ 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసి, ఓటమి పాలైంది. Bangladesh 146/8.

భారత బౌలర్లలో కులదీప్​ 3 వికెట్లతో చెలరేగగా, బుమ్రా పదునైన బౌలింగ్​తో 13 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు, అర్షదీప్​ మరో 2, పాండ్యా ఒక వికెట్​ తీసారు.

 

Latest News