Ananth Ambani| రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఎట్టకేలకి ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టాడు. రాధికా మర్చంట్‌తో ఆయన వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో కనుల పండుగగా జరిగింది.టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై తెగ సందడి చేశారు. అయితే వేడుకకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటిని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
అయితే అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ వివాహ వేడుకలో బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా స్టెప్పులేశారు. షారూఖ్ ఖాన్ పాపులర్ సాంగ్ ‘గోరీ గోరీ’కి వీరిద్దరూ డ్యాన్స్ చేశారు. అనన్య పాండే స్పెషల్ డ్రెస్‌లో కనిపించగా, పాండ్యా కుర్తాలో సందడి చేశారు. వీరి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే పసుపు రంగు లెహంగా ధరించిన అనన్య బ్లౌజ్ వెనుక ‘అనంత్స్ బ్రిగేడ్’ అని రాసి ఉండడం విశేషం.
అనంత్ అంబానీ , రాధిక మర్చంట్‌ల వివాహం కోసం ఆకాశమంత పందిరిని ఏర్పాటు చేసి అందులో కళ్లు జిగేలు మనేలా లైట్లను అలంకరించారు. పెళ్లి వేదిక చుట్టూ కూర్చొని విహహాన్ని వీక్షించేలా ఈ పెళ్లి మండపాన్ని డిజైన్ చేశారు. ఇక రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు ఎలా అయితే కనిపిస్తాయో.. పెళ్లి వేదికపై కూడా అలానే కనిపించేలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ వివాహ వేడుకకి సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా షిరోద్కర్, కూతురు సితార,మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ తన భార్య ఉపాసన, వెంకటేష్, రజనీకాంత్, అఖిల్, బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో.. రాజ్ కుమార్ రావు, తన భార్య పాత్ర లేఖతో కలిసి పెళ్లికి హాజరయ్యాడు. రాజ్ కుమార్ రావు వైట్ కలర్ పైజామాలో కనివిందు చేయగా.. తన భార్య రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించింది.బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్, హీరోయిన్ జెనీలియా, తన భర్త రితేష్ దేశ్‌ముఖ్ కూడా వివాహ వేడుకలో సందడి చేశారు.
VIDEO | Cricketer Hardik Pandya (@hardikpandya7) and actress Ananya Panday (@ananyapandayy) groove to music at the wedding of Anant Ambani and Radhika Merchant in Mumbai. #AnantRadhikaWedding pic.twitter.com/zxYWuQcjxm
— Press Trust of India (@PTI_News) July 12, 2024