India vs South Africa| రెండో టెస్టులో భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం..201 రన్స్ కే అలౌట్

గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్ల ఘోర వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌ టీమిండియా కేవలం 201 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికాకకు భారత్ పై తొలి ఇన్నింగ్స్ లో 288పరుగుల భారీ ఆధిక్యత దక్కింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది.

విధాత : గౌహతి వేదికగా దక్షిణాఫ్రికా(India vs South Africa)తో జరుగుతోన్న రెండో టెస్టు (Second Test)మ్యాచ్‌లో భారత బ్యాటర్ల ఘోర వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌ టీమిండియా(Team India) కేవలం 201 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికాకకు భారత్ పై తొలి ఇన్నింగ్స్ లో 288పరుగుల భారీ ఆధిక్యత(South Africa Lead) దక్కింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 9/0 తో మూడోరోజు సోమవారం ఆటను ప్రారంభించన టీమిండియా బ్యాటర్లను భారీ స్కోర్ సాధించకుండా కట్టడి చేయడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు సఫలమయ్యారు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్‌ (58; 97 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌(48), కేఎల్. రాహుల్ (22) పరుగులతో ఫర్వాలేదనిపించారు. సాయి సుదర్శన్ (15), దృవ్ జురెల్ (0), రిషబ్ పంత్ (7), రవీంద్ర జడేజా(6), నితీష్ కుమార్ రెడ్డి(10), కుల్‌దీప్‌ యాదవ్‌ (19), బూమ్రా(5)లకు అవుటయ్యారు. సిరాజ్ 2పరుగులతో నాటౌట్ ఉన్నాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జన్సెన్ 48 పరుగులకే 6 వికెట్ల పడగొట్టి భారత్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. స్పిన్నర్లు సైమన్ హర్మన్ 3వికెట్లు, కేశవ్ మహారాజ్ 1వికెట్ సాధించారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. సఫారీ బ్యాటర్లలో ముత్తుస్వామి(109), జన్సెన్(93)పరుగుల సూపర్ ఇన్నింగ్స్ తో ఆ జట్టు భారీ స్కోర్ సాధించి ఈ టెస్టులో పటిష్ట స్థితిలో ఉంది. రెండు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే కోల్ కత్తా టెస్టులో విజయం సాధించిన దక్షిణాఫ్రికా సిరీస్ లో 1-0తో ముందంజలో ఉండటం గమనార్హం. మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికాదే పైచేయిగా కనిపిస్తుంది.

Latest News