Site icon vidhaatha

India|రానున్న రోజుల‌లో భార‌త్ ఆడే మ్యాచ్‌లు ఏంటి… 2024 మొత్తం షెడ్యూల్ ఇదే..!

India| టీ20 వర‌ల్డ్ క‌ప్ ద‌క్కించుకున్న టీమిండియా ఆ జోష్‌తో జింబాబ్వేలో అడుగుపెట్టింది. యువ క్రికెట‌ర్స్‌తో కూడిన జ‌ట్టు జింబాబ్వేతో 5 టీ20 సిరీస్ ఆడ‌గా, అక్క‌డ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. జింబాబ్వేపై 4-1తో సిరీస్ గెలిచింది. ఇక‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో శ్రీలంక‌లో 3 టీ20ల సిరీస్‌, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 3 వన్డేల సిరీస్‌ ఆడింది టీమిండియా. శ్రీలంకపై 3-0తో టీ20 నెగ్గిన భారత జట్టు.. లంకపై మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. లంక టూర్ పూర్తి కావ‌డంతో రీసెంట్‌గా టీమిండియా భార‌త్‌కి వ‌చ్చేసింది. ఇక మ‌ళ్లీ మ‌నోళ్లు ఎప్పుడు మ్యాచ్‌లు ఆడ‌తారా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే మ‌నోళ్లు మరో 40 రోజుల వరకు ఎలాంటి మ్యాచ్‌లు ఆడ‌రు. సెప్టెంబర్‌ 19 నుంచి నాన్‌స్టాప్ క్రికెట్ ఆడ‌నుంది. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా.. ఇలా సెప్టెంబ‌ర్ నుండి వ‌రుస సిరీస్ మ్యాచ్‌లు ఆడ‌నుంది. మ‌రి ఎప్పుడెప్పుడు ఏ ఏ జ‌ట్ల‌తో టీమిండియా ఆడ‌నుంద‌నేది చూస్తే..

బంగ్లాదేశ్‌తో 2 టెస్టుల సిరీస్‌
సెప్టెంబర్‌ 19-23: తొలి టెస్టు
సెప్టెంబర్‌ 27-అక్టోబర్‌ 1 వరకు: రెండో టెస్ట్‌

బంగ్లాదేశ్‌తో 3 టీ20ల సిరీస్‌

అక్టోబర్‌ 6: తొలి టీ20
అక్టోబర్‌ 9: రెండో టీ20
అక్టోబర్‌ 12: మూడో టీ20

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌

అక్టోబర్‌ 16-20: తొలి టెస్ట్‌
అక్టోబర్‌ 24-28: రెండో టెస్ట్‌
నవంబర్‌ 1-5: మూడో టెస్ట్‌

సౌతాఫ్రికాతో 4 టీ20ల సిరీస్‌

నవంబర్‌ 8: తొలి టీ20
నవంబర్‌ 10: రెండో టీ20
నవంబర్‌ 13: మూడో టీ20
నవంబర్‌ 15: నాలుగో టీ20

ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్‌

నవంబర్‌ 22-26: తొలి టెస్టు
డిసెంబర్‌ 6-10: రెండో టెస్టు
డిసెంబర్‌ 14-18: మూడో టెస్టు
డిసెంబర్‌ 26-30: నాలుగో టెస్టు
జనవర్‌ 3, 2025 నుంచి 7వ తేదీ వరకు ఐదో టెస్టు.

Exit mobile version