Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో భారత షూటర్ (Indian shooter) మనూ భాకర్ (Manu Bhaker) ఇప్పటికే రెండు పతకాలు సాధించింది. ముందుగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం నెగ్గిన మనూభాకర్, ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మరో షూటర్ సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యం గెలిచింది. ఇప్పుడు మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్స్ దూసుకెళ్లింది. ఈ ఈవెంట్‌లో పతకం నెగ్గితే ఒకే ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా మనూభాకర్ నిలువనున్నారు.
ఇప్పటికే భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా మనూ గుర్తింపు దక్కించుకుంది. ఎందుకంటే ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటికే ఏ భారత్ క్రీడాకారుడుగానీ, క్రీడాకారణిగానీ ఒకే దఫా రెండు పతకాలు సాధించలేదు. తొలిసారి ఆ గుర్తింపు మనూభాకర్ దక్కించుకుంది. ఇప్పుడు ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాల నెగ్గిన ఘనతకు కూడా ఆమె కొద్ది దూరంలో నిలిచింది. కాగా, పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు మూడు కాంస్య పతకాలు సాధించింది. ఆ మూడూ షూటింగ్‌లో వచ్చినవే. అందులో రెండు మను భాకర్ సొంతంగా గెలువగా, మరొకటి సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి నెగ్గింది. మూడో కాంస్య పతకాన్ని మరో షూటర్ స్వప్నిల్ కుసాలె సాధించింది.
ఒలింపిక్స్‌లో నేడు భారత షెడ్యూల్
షూటింగ్
మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ : మను భాకర్
సమయం : మధ్యాహ్నం 1.00
స్కీట్ క్వాలిఫికేషన్
మహిళలు : రైజా ధిలాన్, మహేశ్వరి చౌహాన్
సమయం : మధ్యాహ్నం 12.30
పురుషులు : అనంత్ జీత్ సింగ్
సమయం : మధ్యాహ్నం 12.30
ఆర్చరీ
మహిళల సింగిల్స్ (ఎలిమినేషన్ రౌండ్) : దీపిక కుమారి
సమయం : మధ్యాహ్నం 1.52
మహిళల సింగిల్స్ (ఎలిమినేషన్ రౌండ్) : భజన్ కౌర్
సమయం : మధ్యాహ్నం 2.05
గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే (రౌండ్ 3) : గగన్‌జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ
సమయం : మధ్యాహ్నం 12:30
సెయిలింగ్
మహిళల డింగీ (రేస్ 4) : నేత్ర కుమనన్
సమయం : మధ్యాహ్నం 3.35
పురుషుల డింగీ (రేస్ 4) : విష్ణు శరవణన్
మధ్యాహ్నం : 3.50
బాక్సింగ్
పురుషుల 71 కేజీల ఈవెంట్ (క్వార్టర్స్) : నిశాంత్ దేవ్
సమయం : రాత్రి 12.02 (తెల్లవారితే ఆగస్టు 4)