Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఐదు కాంస్యాలు, ఒక్క రజతం మాత్రమే గెలిచింది. బంగారు పతకం మాత్రం దక్కలేదు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు పసిడి పతకం దక్కుతుందా.. లేదా..? అనేది ఇవాళ్టితో తేలిపోనుంది. ఇవాళ మహిళా రెజ్లర్ రీతికా హుడా (Reetika Hooda) బరిలో దిగనుంది.
రీతికా ఇవాళ మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేయాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ రీతికా ఇవాళ ఫైనల్‌కు చేరకపోతే భారత్ పసిడి పతకం ఆశలు ఆవిరైనట్లే. రీతికా హుడా ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ ప్రీ కార్టర్ ఫైనల్ పోటీలో తలపడనుంది.
ఆ పోటీలో గెలిస్తే మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 4.20 గంటలకు జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్ గెలిస్తే రీతికా మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ సెమీ ఫైనల్‌కు వెళ్తుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ రాత్రి 10.25 గంటలకు జరుగుతుంది. సెమీ ఫైనల్ గెలిస్తే రీతికా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉంటుంది. ఫైనల్ గెలిస్తే భారత్‌కు ఏకైక పసిడి దక్కనుంది.
అదేవిధంగా గోల్ఫ్‌లో దీక్షా ధాగర్, అదిత్ అశోక్ పోరాటం కొనసాగుతోంది. పసిడి కాకపోయినా దీక్షా దాగర్, అదితి అశోక్‌లపై పతక ఆశలు పెట్టుకోవచ్చు. ఇక విశ్వ క్రీడలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రాక్ ఫీల్డ్ ఈవెంట్స్ ఈరోజు కూడా కొనసాగనున్నాయి.
ఇవాళ్టి ముఖ్యమైన పతక ఈవెంట్లు
11:30 AM: అథ్లెటిక్స్, పురుషుల మారథాన్
4:30 PM: వాలీబాల్, పురుషుల ఫైనల్ – ఫ్రాన్స్ vs పోలాండ్
6:30 PM: టేబుల్ టెన్నిస్, మహిళల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ – చైనా vs జపాన్
8:30 PM: ఫుట్బాల్, మహిళల ఫైనల్ – బ్రెజిల్ vs USA
10:30 PM: అథ్లెటిక్స్, పురుషుల హైజంప్ ఫైనల్
11:05 PM: అథ్లెటిక్స్, మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్
11:20 PM: అథ్లెటిక్స్, పురుషుల 5000మీ ఫైనల్
11:45 PM: అథ్లెటిక్స్, మహిళల 1500మీ ఫైనల్
12:30 AM: అథ్లెటిక్స్, పురుషుల 4×400 మీటర్ల రిలే ఫైనల్
12:44 AM: అథ్లెటిక్స్, మహిళల 4×400 మీటర్ల రిలే ఫైనల్
1:00 AM: బాస్కెట్బాల్, పురుషుల ఫైనల్ – ఫ్రాన్స్ vs USA