మెగా వేలం త్వరలో జరుగనున్న దృష్ట్యా, ఐపీఎల్ (IPL 2025) రిటెన్షన్ జాబితాపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని తమతో ఉంచుకుంది? ఏ ఆటగాడు వేలంలోకి వస్తాడో తేలిపోయింది. గురువారమే చివరి గడువు అవడంతో, కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. నవంబర్‌లో మూడో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.
ముంబయి ఇండియన్స్(Mumbai Indians)
- జస్ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు)
- రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
- సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
- హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)
- తిలక్ వర్మ (రూ.8 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)
- రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)
- మతిశ పతిరన (రూ.13 కోట్లు
- శివమ్ దూబె (రూ.12 కోట్లు)
- రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు)
- మహేంద్రసింగ్ ధోనీ (రూ.4 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Begaluru)
- విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
- రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
- యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)
- హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)
- పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)
- అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)
- నితీశ్ రెడ్డి (రూ.6 కోట్లు)
- ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)
- సంజు శాంసన్ (రూ.18 కోట్లు)
- యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు)
- రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు)
- ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు)
- హెట్మయర్ (రూ.11 కోట్లు)
- సందీప్ శర్మ (రూ.4 కోట్లు)
దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)
- అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)
- కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
- ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)
- అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders)
- రింకు సింగ్ (రూ.13 కోట్లు)
- వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు)
- సునీల్ నరైన్ (రూ.12 కోట్లు)
- ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు)
- హర్షిత్ రాణా (రూ.4 కోట్లు)
- రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)
- రషీద్ ఖాన్ (రూ.18 కోట్లు)
- శుభ్‌మన్ గిల్ (రూ.16.5 కోట్లు)
- సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు)
- రాహుల్ తెవాతియా (రూ.4 కోట్లు)
- షారుక్ ఖాన్ (రూ.4 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్(Luknow Super Giants)
- నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు)
- రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు)
- మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు)
- మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు)
- ఆయుష్ బదోనీ (రూ.4 కోట్లు)
పంజాబ్ కింగ్స్ (Punjab Kings)
- శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు)
- ప్రభ్‌సిమ్రన్ సింగ్ (రూ.4 కోట్లు)
కాగా, ఊహించినట్లే, కెఎల్ రాహుల్‌ను లక్నో వదులుకుంది. శుభమన్ గిల్ గుజరాత్‌కు మొదటి ఛాయిస్ కాకపోవడం విశేషం. హైదరాబాద్ జట్టు హెన్రిచ్ క్లాసెన్‌ను తిరగి అట్టిపెట్టుకుంది. అతనికి 23 కోట్లు ఆఫర్ చేసింది. రిటైన్ ఆటగాళ్లలో ఈ మొత్తమే ఐపిఎల్‌లో అత్యధికం కావడం గమనార్హం. ఎంఎస్ ధోనీ ఆడతాడా లేదా అనేదానికి కూడా తెరపడింది. ధోనీని చెన్నై రిటైన్ చేసుకుంది.