kavya maran| మనదేశంలోని ప్రతి క్రికెట్ ప్రేమికుడికి కావ్య మారన్ తప్పక తెలిసి ఉంటుంది. 2018 నుంచి సన్‌రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తోన్న కావ్య మారన్ ఐపీఎల్ వేలం మొదలు ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ కనిపిస్తూ తెగ సందడి చేస్తూ కనిపిస్తుంది. ఆమె హావభావాలని కెమెరా మెన్స్ క్యాప్చర్ చేస్తుండగా, పాపకి సంబంధించిన ఫొటోలు ,వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. సన్‌రైజర్స్‌తోపాటు సన్ టీవీ నెట్‌వర్క్ వ్యవహారాల్లోనూ కావ్య మారన్ చురుగ్గా పాల్గొంటారు. సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక 2024 సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన కావ్య పాప తొలి సారి నెటిజన్స్ నుండి ప్రశంసలు అందుకుంది. అంతకముందు ఆమె సెలక్ట్ చేసిన జట్టు పదే పదే ఓడిపోవడంతో తెగ ట్రోల్ చేశారు.
మనదేశంలో అధిక వేతనం పొందుతున్న సీఈవోల్లో ఒకరైన కావ్య మారన్.. రూ.33వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు. ఆమెకి సంబంధించి ఇటీవల అనేక వార్తలు నెట్టింట ప్రచారాలు సాగాయి. ఎస్ఆర్‌హెచ్ ఆటగాడు అయిన అభిషేక్ శర్మతో ప్రేమలో ఉందని, వారిద్దరు కొంత కాలంగా సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్నారని పుకార్లు వచ్చాయి. అయితే వీటిపై వారిద్దరు ఇంత వరకు స్పందించింది లేదు. అయితే తాజాగా కావ్య మారన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆమె క్యూట్ అండ్ కాస్ట్‌లీ వాటితో ఎప్పుడో ప్రేమలో పడిందని, ఆ ప్రియుడు మరేదో కాదో ఖరీదైన కార్లు అన్ని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మార్కెట్ లోకి వచ్చే అత్యంత ఖరీదైన ప్రతి కారును కావ్య కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు ఆమె గ్యారేజ్‌లో రూ.8 కోట్ల విలువచేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. . 563 హార్స్ పవర్ దీనిసొంతం. అలాగే 600 హార్స్ పవర్ ఉన్న బెంట్లీ బెంటాయ్గా ఎస్ యూవీ ఉంది. దీని ధర రూ.4 కోట్లు. ఇక రూ.2.5 కోట్ల విలువ చేసే ఫెర్రారీ రోమా స్పోర్ట్స్ కారు కూడా ఆమె దగ్గర ఉంది. 570 హార్స్ పవర్ దీనిసొంతం. ప్రీమియం సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ ఐ7 ఉంది. రూ.1.6 కోట్ల విలువచేస్తుంది. అలాగే మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్ష్ 911, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ తోపాటు పలు కంపెనీలకు చెందిన అనేక కార్లు ఉన్నాయి. ఇలా కావ్య పాప ఖరీదైన కార్లతో ఎప్పుడు ప్రేమలో పడిందని కొందరు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు