KKR vs MI| కొంప ముంచిన హార్ధిక్.. ప్లే ఆఫ్స్‌కి చేరుకున్న కోల్‌క‌తా

KKR vs MI| ఐపీఎల్ సీజ‌న్ 17లో ముంబై ఇండియ‌న్స్ ఎంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుందో, అంత అద్భుతంగా కేకేఆర్ ఆడుతూ వ‌స్తుంది. దాదాపు అన్ని మ్యాచ్‌లు డామినేట్ చేస్తూ ఆడుతున్న ఈ జ‌ట్టు గ‌త రాత్రి కూడా ముంబై ఇండియ‌న్స్‌పై అద్భుతంగా ఆడి ప్లే ఆఫ్స్‌కి చేరుకుంది. ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్‌కి చేరుకున్న తొలి జ‌ట్టుగా కేకేఆర్ నిలిచింది. వ‌ర్షం మ్యాచ్‌కి అంత‌రాయం క‌లిగించ‌డంతో 16 ఓవ‌ర్ల మ్యాచ్ ఆడించారు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 1

  • Publish Date - May 12, 2024 / 06:33 AM IST

KKR vs MI| ఐపీఎల్ సీజ‌న్ 17లో ముంబై ఇండియ‌న్స్ ఎంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుందో, అంత అద్భుతంగా కేకేఆర్ ఆడుతూ వ‌స్తుంది. దాదాపు అన్ని మ్యాచ్‌లు డామినేట్ చేస్తూ ఆడుతున్న ఈ జ‌ట్టు గ‌త రాత్రి కూడా ముంబై ఇండియ‌న్స్‌పై అద్భుతంగా ఆడి ప్లే ఆఫ్స్‌కి చేరుకుంది. ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్‌కి చేరుకున్న తొలి జ‌ట్టుగా కేకేఆర్ నిలిచింది. వ‌ర్షం మ్యాచ్‌కి అంత‌రాయం క‌లిగించ‌డంతో 16 ఓవ‌ర్ల మ్యాచ్ ఆడించారు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ముందుగా మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటింగ్ చేయ‌గా, నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నితీష్ రాణా(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) దూకుడుగా ఆడడ‌డంతో భారీ స్కోరే వ‌చ్చింది. ముంబయి బౌలర్లలో పీయూష్‌ చావ్లా 2, బుమ్రా 2, తుషారా, అన్షుల్‌ కంబోజ్‌ చెరో వికెట్‌ తీశారు.

ఇక ల‌క్ష్య చేధ‌న‌లో భాగంగా ముంబై ఇండియ‌న్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చింది. రోహిత్ శ‌ర్మ‌ (19), సూర్య కుమార్ యాదవ్ (11), హార్దిక్ పాండ్యా (2), టిమ్ డేవిడ్ (0), నేహాల్ వధేరా (3), నమన్ ధీర్ (17) వంటి బ్యాట్స్‌మెన్స్ తేలిపోవ‌డంతో ముంబై ఇండియ‌న్స్ ఖాతాలో మ‌రో అప‌జయం చేరింది. ఇషాన్ కిషన్‌(22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), తిలక్ వర్మ(17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32) రాణించినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో రాణించాల్సిన హార్దిక్ పాండ్యా(2).. దారుణంగా విఫలమవ్వడంతో ముంబై ఇండియ‌న్స్‌కి అప‌జ‌యం ఖారారైంది. ప‌వ‌ర్‌ప్లేలో వికెట్ న‌ష్ట‌పోకుండా 59 ప‌రుగులు చేసిన ముంబై ఇండియ‌న్స్ స్పిన్న‌ర్స్ ధాటికి కుప్ప‌కూలారు.

ఇషాన్ కిషన్(40)ను నరైన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ కి పంప‌గా, ఆ వెంటనే రోహిత్ శర్మ ‌ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌(9)ను ఆండ్రీ రస్సెల్ ఔట్ చేశాడు. దాంతో 87 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డ్డ ముంబై ఇండియ‌న్స్‌ని ఎవ‌రు ఆదుకోలేక‌పోయారు. దూకుడుగా ఆడిన నమన్ ధిర్(17),తిలక్ వర్మ(32)ను హర్షిత్ రాణా ఒకే ఓవర్‌లో ఔట్ చేసి కేకేఆర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Latest News