Site icon vidhaatha

Ms Dhoni | అంద‌రి హెల్మెట్స్‌పై భార‌త జెండా ఉంటుంది.. కానీ ధోని హెల్మెట్‌పై ఉండదు! ఎందుకంటే..?

Ms Dhoni |

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్రసింగ్ ధోని క్రికెట్ నుండి త‌ప్పుకొని మూడేళ్లు అయిన ఆయ‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో అల‌రిస్తున్న ధోని ఈ సీజ‌న్‌లో కొన్ని అద్భుత‌మైన షాట్స్ ఆడి అభిమానుల‌ని అల‌రించాడు. వ‌చ్చే సీజ‌న్‌లోను ధోని ఆడ‌తాడ‌ని ఇటీవ‌ల ఆయ‌న భార్య సాక్షి చెప్పుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

అయితే అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత ధోని వ్యాపారాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాడు. సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఇటీవ‌ల ఎల్‌జీఎమ్ అనే చిత్రాన్నినిర్మించ‌గా ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గర బోల్తా కొట్టింది. అయితే ధోనికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ధోని హెల్మెట్‌పై భార‌త జెండా ఎందుకు ఉండ‌దు అనే విష‌యంపై క్లారిటీ ఇచ్చారు.

ధోనికి దేశ భక్తి చాలా ఎక్కువ‌. దేశం అన్నా, సైన్యం అన్నా కూడా అత‌నికి ప్రాణం. ఆ మ‌ధ్య అంతర్జాతీయ క్రికెట్‌కు రెండు నెలలు బ్రేక్ ఇచ్చి మరీ సైన్యంలో చేరిన ధోని ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోని కశ్మీర్‌లో 15 రోజుల పాటు సైనికుడిగా కూడా త‌న‌దైన సేవ‌ల‌నందించాడు.

ప్ర‌స్తుతం భారత ఆర్మీలో ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగి ఉండ‌గా, ఆయ‌న సైనికుడిగా దేశం పట్ల ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటారు. అయితే ఎంతో దేశ‌భ‌క్తి ఉన్న ధోని త‌న హెల్మెట్‌పై మాత్రం జాతీయ జెండాని పెట్టుకోడు. ఇది చాలా మందిని ఆశ్చ‌ర్య‌ ప‌రుస్తూ ఉంటుంది. ధోనీ హెల్మెట్‌పై కేవ‌లం బీసీసీఐ గుర్తు మాత్రమే ఉండ‌గా, జాతీయ జెండాని ఎందుకు ఉంచుకోడ‌ని చాలా మంది ఆలోచ‌న‌లు చేస్తుంటారు. అయితే దానికి బ‌ల‌మైన కార‌ణం ఉంది.

వికెట్ కీపర్‌గా ఉన్న ధోని హెల్మెట్‌ను ప‌లుమార్లు కిందపెట్టాల్సి వస్తుందని, ఆ సమయంలో జాతీయ జెండా‌ను కింద ఉంచినట్లవుతుందని భావించి జాతీయ జెండాని త‌న హెల్మెట్‌పై ఉంచుకోన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు.

దీంతో ధోనికి దేశంపై ఉన్న గౌర‌వం గురించి తెలుసుకొని ప్రజలు ప్ర‌శంస‌లు కురిపించారు.. కురిపిస్తున్నారు. ఇక ధోని మూడేళ్ల క్రితం దేశ స్వాతంత్య్ర‌ దినోత్సవం( ఆగస్టు 15న) రోజే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ రోజు త‌న త‌ల్లి బ‌ర్త్ డే కూడా కావ‌డంతో ధోని సైలెంట్‌గా రిటైర్మెంట్ ప్ర‌కటించాడ‌ని ఆయ‌న భార్య ఇటీవ‌ల తెలియ‌జేసింది.

Exit mobile version