కొత్త పుంతలు తొక్కుతున్న ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల ప్రచారం దేశ వ్యాప్తంగా అధికార, విపక్ష పార్టీల మధ్య పోటాపోటీగా సాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోల హామీలతో పాటు జనాకర్షక పథకాలను

  • Publish Date - April 14, 2024 / 08:29 PM IST

విధాత : సార్వత్రిక ఎన్నికల ప్రచారం దేశ వ్యాప్తంగా అధికార, విపక్ష పార్టీల మధ్య పోటాపోటీగా సాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోల హామీలతో పాటు జనాకర్షక పథకాలను ప్రకటిస్తూ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ప్రచార, ప్రసార సాధనాలలో, సోషల్ మీడియాలో ఎన్నికల ప్రకటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు..అభ్యర్థులు ప్రచార వ్యూహాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. హోర్డీంగ్‌లు, డిజిటల్ ప్రచారాలతో పాటు ఆటోలపైన, వాహనాలపైన, టోపీలు, బ్యాగ్‌లు, చొక్కాలపైన, టోపీలపైన పార్టీల గుర్తులతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా హెల్మెట్‌లను సైతం పార్టీ గుర్తులతో డిజైన్ చేసి బైక్‌లపై బృందాలుగా ప్రచారం సాగిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే యువతకు పార్టీ గుర్తులతో ఉన్న హెల్మెట్‌లను పంపిణీ చేస్తూ వారికి శిరస్త్రాణ భద్రత అందించడంతో పాటు తమ ప్రచారాన్ని కొనసాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Latest News