T20 World Cup| వ‌రల్డ్ క‌ప్‌కి ఇవ్వాల్సిన గౌర‌వం ఇది.. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్‌కి నెటిజ‌న్ల చుర‌కలు

T20 World Cup| టీమిండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ గెల‌వ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగులతో ఓడించి ఇండియన్ టీమ్ విశ్వవిజేతగా నిలిచింది. ఇక ఫైన‌ల్ గెలిచిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క ఇండియన్ క్రికెట‌ర్ కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. క‌ప్‌ని ప‌ట్టుకొని తెగ మురిసిపోయారు. ఇక సౌతాఫ్రికా కూడా చివ‌రి వ‌ర‌కు అద్భుత పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శింద‌ని, ప్ర‌శంసిస్తున్నా

  • Publish Date - July 1, 2024 / 06:45 AM IST

T20 World Cup| టీమిండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ గెల‌వ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగులతో ఓడించి ఇండియన్ టీమ్ విశ్వవిజేతగా నిలిచింది. ఇక ఫైన‌ల్ గెలిచిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క ఇండియన్ క్రికెట‌ర్ కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. క‌ప్‌ని ప‌ట్టుకొని తెగ మురిసిపోయారు. ఇక సౌతాఫ్రికా కూడా చివ‌రి వ‌ర‌కు అద్భుత పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శింద‌ని, ప్ర‌శంసిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో ఆస్ట్రేలియాను మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అందుకు కార‌ణం 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన ఆస్ట్రేలియా ఆ త‌ర్వాత ఓవ‌రాక్ష‌న్ చేసి అనేక విమ‌ర్శ‌ల పాలైంది. ముఖ్యంగా ఆ టీమ్ ఆల్​రౌండర్ మిచెల్ మార్ష్​ అయితే ఏకంగా కప్పుపై కాళ్లు పెట్టాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ మీద కాళ్లు పెట్టి ఫొటోల‌కి పోజులిచ్చాడు. అది పెద్ద దుమారం లేపింది. వారికి ఆడ‌డం తప్ప విలువలు తెలియ‌వంటూ దారుణంగా విమ‌ర్శించారు. ఆ ఇష్యూపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చిన కూడా ఆసీస్ ఆటగాళ్లు గానీ ఆ దేశ బోర్డు కాని ఖండించిన దాఖలాలు లేవు. అయితే టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన త‌ర్వాత రోహిత్ శ‌ర్మ ప్ర‌వ‌ర్తించిన తీరుని అంద‌రు ఫుల్ హైలైట్ చేస్తున్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ అందుకున్న త‌ర్వాత రోహిత్ శ‌ర్మ దానిని గుండెల‌కి హ‌త్తుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కప్పు గెలిచాక ఫుల్ ఎమోషనల్ అయిన రోహిత్ శ‌ర్మ సహచర ఆటగాళ్లను పట్టుకొని ఏడ్చేశాడు. ఆఖరి ఓవర్ వేసి మ్యాచ్​ను మలుపు తిప్పిన హార్దిక్ పాండ్యాకు ముద్దు పెట్టాడు.

ఇక జాతీయ పతాకాన్ని మైదానంలో నాటాడు. కప్​ను పట్టుకొని కోహ్లీతో కలసి ఫొటోలకు పోజులు ఇచ్చాడు. ఇదే క్రమంలో కప్​ను తన గుండెకు హ‌త్తుకొని ఎంతో మురిసిపోయాడు. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మార్ష్ అంత అవ‌మానించ‌గా, రోహిత్ శ‌ర్మ మాత్రం హృద‌యాల‌కి హ‌త్తుకొని అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి మ‌ధ్య తేడాని తెగ హైలైట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో మార్ష్‌ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఇక టీమిండియాకి టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్కిన త‌ర్వాత రోహిత్ శ‌ర్మ తాను టీ20 కెరియ‌ర్‌కి గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఇక రోహిత్ బాట‌లోనే విరాట్ కోహ్లీ, ర‌వీంద్ర జ‌డేజా కూడా టీ20కి గుడ్ బై చెప్పారు.

Latest News