Head Coach| టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో తదుపరి హెడ్ కోచ్‌గా ఎవరిని ఎంపిక చేస్తారు అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. భారత జట్టు కోచ్‌గా మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఎంపిక ఫైనల్ అయినట్టు దాదాపుగా తెలుస్తుంది. కోల్‌కతాను ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపిన తర్వాత గంభీర్‌ని హెడ్ కోచ్‌గా నియమించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్టుగా అర్ధమవుతుంది. హెడ్ కోచ్‌గా గౌతీ ఎంపిక ఇప్పటికే జరిగిపోయినట్టు ఐపీఎల్ టీమ్ యజమాని తెలియజేశారు.
ఇక గంభీర్‌కి ఇచ్చే జీత భత్యాల గురించి కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే టీమిండియా కోచ్ పోస్టు కోసం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లను సంప్రదిస్తున్నట్టు వస్తున్న వార్తలని జైషా ఖండించడం మనం చూశాం. అయితే హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ జారీ చేసిన దరఖాస్తు గడువు మే 27తో ముగిసింది. ఈ పదవి కోసం సుమారు 3 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇందులో భారీ సంఖ్యలో నకిలీ దరఖాస్తులు ఉండగా, వాటిలో నరేంద్ర మోదీ, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, అమిత్ షా, , ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ సహా సహా ప్రముఖుల పేర్లపై కూడా నకిలీ దరఖాస్తులు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా ఫేక్ పేర్లతో దరఖాస్తులు సమర్పించడంతో అసలు ఎవరనేది కనిపెట్టడం ఇప్పుడు బీసీసీఐకి పెద్ద సవాల్‌గా మారింది. 2022లో బీసీసీఐ చీఫ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు దాదాపు 5,000 దరఖాస్తులు రాగా, అందులో కూడా చాలా దరఖాస్తులు నకిలీవిగానే ఉన్నాయి. అయితే హెడ్ కోసం సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. అమెరికాలో జరిగే టీ20 వరల్డ్‌కప్ రాహుల్ ద్రవిడ్‌కి చివరి టోర్నీ కానుంది. ఇక జూలైలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌తో కొత్త కోచ్ బాధ్యతలు అందుకుంటారు. ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లు , బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ , 2025లో పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఇలా పలు మ్యాచ్‌లకి కొత్త కోచ్ ఆధ్వర్యంలో జరగనున్నాయి.