Smriti Mandhana| స్మతి మంధాన ఛార్మింగ్.. రైజింగ్

ఇటీవల అనూహ్యంగా తన పెళ్లి రద్దుతో ఢీలా పడినట్లుగా అనిపించిన భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరగానే ఆ షాక్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా న్యూ స్టైలిష్ ఛార్మింగ్ లుక్ తో కూడిన తన ఫోటోలను ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ చేయగా..అవి వైరల్ అయ్యాయి. ‘గ్లింప్‌సెస్‌ ఆఫ్‌ లైఫ్‌’ అంటూ ఆమె కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు.

విధాత : ఇటీవల అనూహ్యంగా తన పెళ్లి రద్దుతో ఢీలా పడినట్లుగా అనిపించిన భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) త్వరగానే ఆ షాక్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా న్యూ స్టైలిష్ ఛార్మింగ్ లుక్ తో కూడిన తన ఫోటోలను ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ చేయగా..అవి వైరల్ అయ్యాయి. ‘గ్లింప్‌సెస్‌ ఆఫ్‌ లైఫ్‌’ అంటూ ఆమె కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఓ మొబైల్ కంపెనీ ప్రమోషన్ లో భాగంగా స్మృతి చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన ఈ ఫోటోలలో ఆమె చాల ఆత్మ విశ్వాసంతో..ధైర్యంగా కనిపించారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. స్మృతి కొత్త ఫోటోలు ఆమెలోని ఛార్మింగ్..డేరింగ్..రైజింగ్ ను చాటుతున్నాయని అభినందిస్తున్నారు.

ఇటీవల మ్యూజిక్ డైరక్టర్ పలాశ్ ముచ్చల్ తో తన పెళ్లి రద్దయిన నేపథ్యంలో తనకు కొంత ప్రైవసీ కావాలంటూ అభిమానులను కోరుకున్నారు. బ్రేకప్‌ తర్వాత కోలుకున్న స్మృతి.. క్రికెట్‌ తన ఫస్ట్‌ లవ్‌ అని, దేశం తరుపున క్రికెట్‌ ఆడడం తప్ప తనకు ఇంకేది ఇష్టం లేదని వెల్లడించింది. భారత్ తరపున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం. నా దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంటుందని..వీలైనంత కాలం టీమిండియా తరఫున ఆడాలని, ట్రోఫీలను గెలవడమే నా లక్ష్యమని పేర్కొన్నది. ఇక ముందుకు సాగాల్సిన టైమ్‌ వచ్చింది అని స్మృతి మంధాన ప్రకటించింది. తను అన్నట్లుగానే తాజాగా ఆమె తన భవిష్యత్తు ప్రయాణంలో ముందుకు సాగుతున్నది.

డిసెంబర్‌ 21 నుంచి 30 వరకు స్వదేశంలో శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం స్మృతి సన్నద్దమవుతున్నది. స్మృతి మంధాన తాజా ఐసీసీ మహిళల వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. మంగళవారం నాడు ఆమె దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్‌ను అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచింది.

Latest News