Site icon vidhaatha

T20 World Cup 2024 | టి20 ప్రపంచకప్​లో సూపర్​–8 జట్లను ముందే ఎలా నిర్ణయించారు?

ఐసీసీ టి20 క్రికెట్​ ప్రపంచకప్​(ICC T20 World Cup 2024)లో తలపడే 20 జట్లను నాలుగు గ్రూపులు ఎ, బి, సి, డి గా విభజించారు. ఒక్కో గ్రూప్​లో ఐదేసి జట్లుంటాయి. లీగ్​ దశ దాటాక, గ్రూప్​లో మొదటి, రెండో స్థానాల్లో ఉన్న జట్లు సూపర్–8కి వెళతాయి. సూపర్​–8లో మళ్లీ రెండు గ్రూప్​లు ఏర్పడతాయి. గ్రూప్​–1(Group- 1), గ్రూప్​‌–2(Group 2). ఈ గ్రూప్​ 1,2 ల్లో ఉండే జట్లు ఈ విధంగా ఉంటాయి.

గ్రూప్​–1 : ఏ1, సి1, బి2, డి2 (Group 1: A1, C1, B2, D2)

గ్రూప్​–2: బి1, డి1, ఏ2, సి2 (GROUP 2 : B1, D1, A2, C2)

ఐసీసీ సీడింగ్(ICC Seeding)​ వల్ల ఈ గ్రూపుల్లోనే ఓ మెలిక ఉంది. ఇంతకుముందు ప్రపంచకప్​లలా కాకుండా, ఈసారి మొదటి రౌండ్(First Round : League Stage)​ ఫలితాల ప్రభావం లేకుండా ఐసీసీ ముందే జాగ్రత్తలు తీసుకుని సూపర్​–8 జట్లను సీడింగ్​ ద్వారా ముందే నిర్ణయించేసింది.

ఏంటీ ఐసీసీ సీడింగ్​? What is ICC Seeding?

ప్రపంచకప్​ టోర్నీకి ముందు ఐసిసి టి20 ర్యాంకింగ్స్​ ఆధారంగా ఐసీసీ జట్లకు ఈ సీడింగ్​ ఇచ్చింది. అంటే గత సంవత్సర కాలంగా మారుతున్న అంతర్జాతీయ టి20 మ్యాచ్​ల ఫలితాలను బట్టి ఆయా జట్లకు ఐసిసి ర్యాంకులు కేటాయిస్తుందని మనకు ముందే తెలుసు. కాబట్టి కేవలం జట్ల మొదటి దశ(ఫస్ట్​ రౌండ్​) ఫలితాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుంటే, ఆ జట్టు సామర్థ్యాన్ని తక్కువచేసినట్లవుతుందని భావించిన ఐసీసీ, ప్రపంచకప్​ మొదలు కావడానికి ముందు రోజు ఐసిసి టి20 ర్యాంకింగ్స్(ICC T20 Rankings before World Cup)​ ఆధారంగా సూపర్​–8లో జట్లకు సీడింగ్​ ఇచ్చింది. దాని ప్రకారం, టి20 ప్రపంచకప్​ సీడింగ్​లు ఇలా ఉన్నాయి.

 

సీడింగ్​ గ్రూప్​–ఎ గ్రూప్​–బి గ్రూప్​–సి గ్రూప్​–డి
1 భారత్ ఇంగ్లండ్ న్యూజీలాండ్ దక్షిణాఫ్రికా
2 పాకిస్తాన్ అస్ట్రేలియా వెస్టిండీస్ శ్రీలంక
3 ఐర్లండ్ నమీబియా అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
4 కెనడా స్కాట్లాండ్ ఉగాండా నెదర్లాండ్స్
5 అమెరికా ఒమన్ పపువా న్యూగినీ నేపాల్

 

పై పట్టిక ప్రకారం, భారత్​ ఏ1 గా ఉంది. ఫస్ట్​ రౌండ్​(లీగ్​ దశ)లోనూ టాపర్​గా ఉంది. పాకిస్తాన్​ ఏ2 గా ఉంది. కానీ, పాకిస్తాన్​ సూపర్​–8లోకి ప్రవేశించలేకపోయింది కాబట్టి, సూపర్​–8(సెకండ్​ రౌండ్​–రెండో దశ)లోకి ప్రవేశించిన అమెరికా ఏ2 అవుతుంది. అలాగే అస్ట్రేలియా లీగ్​ దశలో నెంబర్​ 1 గా ఉన్నా, ఇంగ్లండ్​ రెండోస్థానంలో ఉన్నా, సీడింగ్​లో అస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది కాబట్టి, బి2 గానే ఆడుతుంది. ఇంగ్లండ్​ బి1గానే ఆడుతుంది.

అలాగే పై సీడింగ్​ల ప్రకారం సూపర్​–8 మ్యాచ్​ల షెడ్యూల్​ ఈ విధంగా ఉంది. అందుకే 24వ తేదీ భారత్​, అస్ట్రేలియా(India vs Australia)ల మధ్య మ్యాచ్​ ముందే డిసైడ్​ అయింది. ఒకవేళ గ్రూప్​లోని టాప్​ 2 జట్లలో ఏదైనా సూపర్​–8కు అర్హత సాధించలేకపోతే, సాధించిన జట్టు ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. అమెరికా, పాకిస్తాన్​ను రీప్లేస్​ చేసినట్లు. లీగ్​ దశ (మొదటి రౌండ్​) ముగిసేనాటికి ఇలా అన్ని స్థానాలూ భర్తీ అవుతాయి. ప్రస్తుతానికి పరిస్థితి ఈ కింది విధంగా ఉంది.

19.06.2024 – ఎ2 X డి1 (అమెరికా X దక్షిణాఫ్రికా ​)

20.06.2024 – బి1 X సి2 (వెస్టిండీస్​ X సి2) ‌‌‌‌

20.06.2024 – సి1 X ఎ1 (అఫ్ఘనిస్తాన్​ X భారత్​)

21.06.2024 – బి2 X డి2 (అస్ట్రేలియా X డి2)

21.06.2024 – బి1 X డి1 (డి1 X దక్షిణాఫ్రికా)

22.06.2024 – ఎ2 X సి2 (అమెరికా X వెస్టిండీస్​)

22.06.2024 – ఎ1 X డి2 (భారత్​ X డి2)

23.06.2024 – సి1 X బి2 (అఫ్ఘనిస్తాన్​ X అస్ట్రేలియా)

23.06.2024 – ఎ2 X బి1 (అమెరికా X బి1)

24.06.2024 – సి2 X డి1 (వెస్టిండీస్ X దక్షిణాఫ్రికా)

24.06.2024 – బి2 X ఎ1 (అస్ట్రేలియా X భారత్​)

25.06.2024 – సి1 X డి2(అఫ్ఘనిస్తాన్ X డి2)

ఇదీ లెక్క. ఇక్కడితో సూపర్​–8 సమాప్తం. ఇక సెమీస్​ మొదలు. ఈ సీడింగ్​ పద్ధతి ఐసీసీ ఇంతకుముందే వాడింది. 2007, 2009, 2010, 2012లలో ఇదే పద్ధతిని అవలంబించింది. కానీ, తర్వాత మానేసి ఇప్పుడు మళ్లీ మొదటుపెట్టింది.

 

Exit mobile version