Video| నెరిసిన గ‌డ్డం, మాసిన జుట్టుతో యువ‌రాజ్.. ఎందుకిలా మారిపోయాడు..!

Video| భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. ఆల్‌రౌండ‌ర్‌గా భార‌త్‌కి ఎన్నో మంచి విజ‌యాలు అందించిన యువ‌రాజ్ ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 కు యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు.జూన్2 నుండి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ప్రారంభ‌మైన విష‌యం తె

  • Publish Date - June 5, 2024 / 06:31 AM IST

Video| భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. ఆల్‌రౌండ‌ర్‌గా భార‌త్‌కి ఎన్నో మంచి విజ‌యాలు అందించిన యువ‌రాజ్ ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 కు యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు.జూన్2 నుండి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్​లోనే పలు రికార్డులు బద్దలయ్యాయి. యూఎస్​ఏ-కెనడా మ్యాచ్​లో ఆరోన్ జోన్స్ విధ్వంసక ఇన్నింగ్స్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇక నమీబియా-ఒమన్ మ్యాచ్ టై కావడం.. వెస్టిండీస్-పపువా న్యూగినియా మ్యాచ్​ కూడా చివ‌రి వ‌ర‌కు వెళ్ల‌డం ఇప్పుడు ఆస‌క్తిని రేపుతుంది.

ఇక బ‌డా మ్యాచ్‌లు మొద‌లు కాలేదు. మ‌రోవైపు భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స‌మ‌యంలో యువ‌రాజ్ సింగ్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ముస‌లాయ‌న రూపంలో కుర్రాళ్ల ద‌గ్గ‌ర‌కి వెళ్లిన యువ‌రాజ్ సింగ్‌.. ప్రపంచకప్ ఏం చూస్తారు? తన ధనాధన్ బ్యాటింగ్ చూడండి అని అన్నారు. మొద‌ట్లో బంతిని డిఫెన్స్ ఆడిన యురాజ్ సింగ్ ఆ త‌ర్వాత మాత్రం భారీ షాట్ల‌తో విరుచుకుప‌డ్డాడు. నెరిసిన జట్టు, భారీ గడ్డం, నెత్తికి క్యాప్​, స్థానికుల వేషధారణతో ముసలివాడిలా కనిపించి వారిని సర్​ప్రైజ్ చేశాడు లెజెండ్ యువరాజ్ సింగ్. వృద్ధుడిలా మేకప్ వేసుకొని పర్వత ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న యువకుల దగ్గరకు వెళ్ల‌గా వారు ఏ మాత్రం గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారు.

త‌ర్వాత యువ‌రాజ్ సింగ్ త‌న మేక‌ప్ తొలిగించ‌డంతో వారంతా కూడా షాక్ అయ్యారు . యువ‌రాజ్‌తో క‌లిసి ప‌లు ఫోటోలు, సెల్ఫీలు దిగారు. ఇక యువ‌రాజ్ సింగ్ ఒక అడ్వ‌ర్టైజ్‌మెంట్‌లో భాగంగా ముస‌లాడిలా మారి అల‌రించాడు. ఇక త్వరలో జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ మీద యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్​లో గెలిచినా, ఓడినా అందరి ఫోకస్ రోహిత్ సేన మీదే ఉంటుందని తెలియ‌జేశాడు.. మ్యాచ్ రోజు ఎవరైతే ఎమోషన్స్​ను కంట్రోల్ చేసుకుంటారో వాళ్లదే విజయమని యువీ తెలిపాడు.

Latest News