Team India Coach | టీమిండియాకు కొత్త హెడ్‌ కోచ్‌..! దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ..!

Team India Coach | టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియాలో పెను మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. సోమవారం రాత్రి బీసీసీఐ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదిక ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్‌ను నియమించనున్నట్లు బోర్డు సెక్రెటరీ జైషా ఇటీవల ప్రకించిన విషయం తెలిసిందే.

  • Publish Date - May 14, 2024 / 07:36 AM IST

Team India Coach | టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియాలో పెను మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. సోమవారం రాత్రి బీసీసీఐ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదిక ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాకు కొత్త కోచ్‌ను నియమించనున్నట్లు బోర్డు సెక్రెటరీ జైషా ఇటీవల ప్రకించిన విషయం తెలిసిందే. మళ్లీ ద్రావిడ్‌ అప్లయ్‌ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి. ద్రవిడ్‌ మళ్లీ దరఖాస్తు చేసుకోకపోతే కొత్త కోచ్‌ను నియమించనున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత ద్రవిడ్‌ కాంటాక్ట్‌ ముగిసింది. ఆ తర్వాత ద్రవిడ్‌తో బీసీసీఐ చర్చలు జరిపి టీ20 ప్రపంచకప్‌ వరకు కొనసాగేలా ఒప్పించింది.

కొత్త హెడ్‌ కోచ్‌ నేతృత్వంలోనే..

కొత్త హెడ్‌ కోచ్‌ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించిన బీసీసీఐ ఈ నెల 27న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా కోచ్‌ ఎంపిక విధానాన్ని తెలిపింది. దరఖాస్తులను పరిశీలించి.. ఇంటర్వ్యూలు చేసి షార్ట్‌లిస్ట్‌ చేసి.. అందులో ఒకరిని కోచ్‌గా నియమిస్తారు. కొత్త కోచ్‌ పదవీకాలం 3.5 సంవత్సరాలు. జులై 1, 2024 నుంచి ప్రారంభమై డిసెంబర్‌ 31, 2027తో కాంట్రాక్టు ముగుస్తుంది. కొత్త ప్రధాన కోచ్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ-2025, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్-2025, 2027తో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌, 2027 వన్డే వరల్డ్‌ కప్‌ ఆడనున్నది. కొత్త కోచ్‌కి మూడు పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లతో పాటు రెండు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లు గెలవడం సవాల్‌గా మారనున్నది.

కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత

ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి కనీసం 30 టెస్టు మ్యాచ్‌లు లేదంటే 50 వన్డే మ్యాచ్‌లు ఆడి ఉండాలి. లేదంటే పూర్తి సభ్యుడిగా టెస్ట్‌లు ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా పని చేసిన రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదంటే ఐపీఎల్‌ జట్టుకు అసోసియేట్‌ మెంబర్‌/హెడ్‌కోచ్‌ లేదంటే సమాజమైన అంతర్జాతీయ లీగ్‌-ఫస్ట్‌ క్లాస్‌ జట్లు, జాతీయ ఏకోచ్‌గా కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా బీసీసీఐ లెవల్‌ 3 సర్టిఫికేట్ లేదంటే ఏదైనా సమానమైన డిగ్రీని పొంది ఉండాలి. దరఖాస్తుదారుడి వయస్సు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలని బీసీసీఐ పేర్కొంది.

ద్రవిడ్‌ కొనసాగడం కష్టమే..

టీ20 ప్రపంచకప్ తర్వాత కూడా ద్రవిడ్ ఆ పదవిలో కొనసాగాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇటీవల తెలిపారు. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తోంది చెప్పారు. అతను మళ్లీ పదవిలో కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు దీర్ఘకాలిక కోచ్ కోసం చూస్తున్నాం. అయితే, ద్రవిడ్ వచ్చే 3.5 సంవత్సరాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం కష్టం. ఎందుకంటే.. ఇప్పటికే నవంబర్ 2021 వరకు పాత్రలో ఉన్నాడు. ద్రావిడ్ కూడా తన కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నానని ఇటీవల చెప్పాడు. ద్రవిడ్ పిల్లలిద్దరూ కూడా క్రికెట్ ఆడతారు. అలాంటి పరిస్థితిలో, ద్రవిడ్ కుటుంబంతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడు. వన్డే ప్రపంచకప్‌ తర్వాత హెచ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనా.. బీసీసీఐ టీ20 వరల్డ్‌ కప్‌ వరకు కొనసాగేలా ఒప్పించింది.

కొత్త కోచ్‌ ముందున్న సవాళ్లు..

జూలైలో శ్రీలంకలో జరిగే వన్డే సిరీస్‌తో కొత్త కోచ్ పదవీకాలం మొదలయ్యే అవకాశం ఉన్నది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లతో సొంతగడ్డపై రెండు టెస్టు సిరీస్‌లు ఆడనుంది. సంవత్సరం చివరలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ కూడా ఆస్ట్రేలియాలో పర్యటించాలి. ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలి. ఆ తర్వాత 2025లో పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆ ఏడాది మధ్యలో ఇంగ్లండ్‌ పర్యటన కూడా ఉంది. భారతదేశం-శ్రీలంక సంయుక్తంగా 2026లో T20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాలో ఆడాల్సి ఉంది. రాబోయే కొత్త కోచ్‌ కెరీర్ చివరి దశలో ఉన్న ఇద్దరు భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ (35 ఏళ్లు), ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ (37 ఏళ్లు)ను కలుపుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

Latest News