Team India | ఢిల్లీలో ల్యాండ్‌ అయిన ‘విశ్వవిజేత’..! గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పిన అభిమానులు..!

Team India | వెస్టిండిస్‌, అమెరికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ విజేత టీమిండియా ఢిల్లీ గడ్డపై కాలుమోపింది. బార్బడోస్‌ నుంచి ప్రత్యేక విమానంలో నిన్న బయలుదేరగా.. గురువారం విమానాశ్రయానికి చేరుకున్నది. బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌ ఎయిర్‌పోర్ట్‌ మూతపడ్డ విషయం తెలిసిందే.

  • Publish Date - July 4, 2024 / 07:54 AM IST

Team India | వెస్టిండిస్‌, అమెరికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ విజేత టీమిండియా ఢిల్లీ గడ్డపై కాలుమోపింది. బార్బడోస్‌ నుంచి ప్రత్యేక విమానంలో నిన్న బయలుదేరగా.. గురువారం విమానాశ్రయానికి చేరుకున్నది. బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌ ఎయిర్‌పోర్ట్‌ మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో భారత జట్టు నాలుగు రోజులు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాతావరణం అనుకూలించడంతో గురువారం విశ్వవిజేత భారత్‌కు బయలుదేరింది. దాదాపు 18 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆ ప్రత్యేక విమానంలో టీమిండియా ప్లేయర్లు ట్రోఫీని తీసుకొని ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు ట్రోఫీని తీసుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారి ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేర్‌ చేసింది. ఇక విమానాశ్రయంలో జట్టుకు ఘన స్వాగతం లభించింది. టీమిండియా బస చేయనున్న హోటల్‌ వద్ద ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.


హోటల్‌లో టీమ్ ఇండియా సభ్యులు కలిసి ప్రత్యేక కేక్‌ను కట్ చేసి సంబురాలు చేసుకోనున్నారు. హోటల్‌లో వెల్‌కమ్ డ్రింక్స్ కూడా టీమ్ మొత్తానికి సిద్ధంగా ఉన్నాయి. తదుపరిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని టీమిండియా సభ్యులు గౌరవపూర్వకంగా కలువనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబయికి బయలుదేరి వెళ్తారు. అక్కడ గ్రాండ్‌ స్వాగతం పలికేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఇక నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు అభిమానుల కోసం టీమిండియా ప్రత్యేక రోడ్ షో ఉంటుంది. అనంతరం స్టేడియంలో టీమిండియాతో పాటు జట్లు సహాయక సిబ్బందిని సన్మానించి.. రూ.120కోట్ల ప్రైజ్‌మనీ అందజేయనున్నది బీసీసీఐ. టీమిండియా ఢిల్లీకి రానున్నదన్న సమాచారంతో క్రికెటర్లను చూసేందుకు అభిమానులు తెల్లవారుజాము నుంచే ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద గుమిగూడారు. ఆయా క్రికెటర్లు ఎయిర్ పోర్టులో నుంచి బస్సు ఎక్కేందుకు వస్తుండగా.. అక్కడున్న అభిమానులు వారిని పేర్లతో పిలవడం వీడియోల్లో కనిపించింది.

Latest News