Site icon vidhaatha

టీమిండియా ఘన విజయం

విధాత,లండన్‌: మూడో టెస్టు ఓటమి ప్రతీకారంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో టెస్టులో నిలబడింది. అన్ని ఫార్మాట్లో రాణించి ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టింది. 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌లో హమీద్‌ (60), బర్న్స్‌ (59) ఇద్దరే అర్థశతకాలతో రాణించారు. టీమిండియా బౌలింగ్‌లో ఉమేశ్‌యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, జడేజా, శార్దూల్‌ తల రెండు వికెట్లు తీశారు. ఇక తొలి, రెండు ఇన్నింగ్స్‌లో టీమిండియా వరుసగా 191/10, 466/10 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 290/10, 210/10 పరుగులే చేసింది.

Exit mobile version