Vaibhav Suryavanshi| వైభవ్ సూర్యవంశీ మరో రికార్డు

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్వితీయ బ్యాటింగ్ తో మరో రికార్డు సృష్టించారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ(108*) సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతిపిన్న వయసు (14 ఏళ్ల 250 రోజులు)లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

విధాత : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) తన అద్వితీయ బ్యాటింగ్ తో మరో రికార్డు సృష్టించారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ(108*) సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)లో అతిపిన్న వయసు (14 ఏళ్ల 250 రోజులు)లో సెంచరీ( youngest centurion record) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర జరిగిన మ్యాచ్ లో బీహార్ తరపున ఆడిన సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాక అతితక్కువ వయసులో సెంచరీ రికార్డు(18 ఏళ్ల 118 రోజులు) విజయ్ జోల్ పేరిట ఉంది. వైభవ్ సూర్యవంశీ సెంచరీతో ఆ రికార్డు తుడిచిపెట్టుకపోయింది. వైభవ్ 61బాల్స్ లో 7ఫోర్లు, 7సిక్స్ లతో 108పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. దీంతో బీహార్ 3వికెట్లకు 20ఓవర్లలో 176పరుగులు చేసింది.

అయినా ఓడిన బీహార్

వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీతో బీహార్ ఈ మ్యాచ్ లో మంచి స్కోర్ చేసినప్పటిని బౌలర్లు విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. 176పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో 7వికెట్లు పడగొట్టినప్పటికి పరుగుల కట్టడి చేయలేకపోయారు. మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీషా 66పరుగుల(30బంతుల్లో 11ఫోర్లు, 1సిక్స్) తో ఆ జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. నీరజ్ జోషి 30, రంజీత్ నికమ్ 27, నిఖిల్ నాయక్ 22పరుగులతో రాణించి 5బంతులు మిగిలి ఉండగానే..మహారాష్ట్రను గెలిపించారు.

Latest News