Site icon vidhaatha

ఎన్‌సీఏ అధిపతిగా బాధ్యతలు చేపట్టేందుకు తిర‌స్క‌రించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌

విధాత‌: ఎన్‌సీఏ అధిపతిగా బాధ్యతలు చేపట్టేందుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తిరస్కరించాడు. ప్రస్తుతం ఎన్‌సీఏను నడిపిస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌.. టీ20 ప్రపంచకప్‌ అనంతరం టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడు కావడం దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌సీఏ బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ లక్ష్మణ్‌ను కోరగా అతనందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో కొత్త ఎన్‌సీఏ అధిపతి కోసం బీసీసీఐ తన అన్వేషణను కొనసాగిస్తోంది. లక్ష్మణ్‌ ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ జట్టుకు బ్యాటింగ్‌ సలహాదారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మెంటార్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

Exit mobile version