Site icon vidhaatha

Women’s T20 World Cup | అక్టోబర్‌ 3 నుంచి మహిళల పొట్టి ప్రపంచకప్‌.. షెడ్యూల్‌ విడుదల

Women’s T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడులైంది. ఉమెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ 2024కు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ విడుదల చేసింది. బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3 నుంచి ఈ మెగా టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. అక్టోబర్ 20 వరకు జరగనున్న ఈ టోర్నీలో 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 10 జట్లు ఈ పొట్టి ప్రపంచకప్‌లో పోటీపడనున్నాయి.

ఇప్పటికే ఎనిమిది జట్లు పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించగా క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా మరో రెండు జట్లు అర్హత సాధించనున్నాయి. ఈ 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, క్వాలిఫయర్ 1 ఉండగా.. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ 2 జట్లు ఉన్నాయి.

ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 4న సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. సెమీ ఫైనల్‌, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు ఉన్నాయి.

Exit mobile version