Site icon vidhaatha

Mars Curiosity Rover | అంగారకుడి మీద జీవంపై కొత్త క్లూ! వింత నిర్మాణాల గుర్తింపు!

Mars Curiosity Rover | విశ్వంలో జీవం మరెక్కడన్నా ఉన్నదా? అనే క్రమంలో సాగిస్తున్న పరిశోధనలు అన్నీ ఇన్నీ కావు. వీటిలో ప్రధానంగా అంగారక గ్రహం మీద శాస్త్రవేత్తల కళ్లన్నీ ఉన్నాయి. అక్కడ మనిషి జీవించేందుకు అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయనే అంచనాతో ఉన్న శాస్త్రజ్ఞలు.. ఆ క్రమంలో ఆ గ్రహాన్ని తమ టెలిస్కోపులతో అణువణువూ గాలిస్తున్నారు. ఈ క్రమంలో అనేక విశేషాలు వెలుగు చూస్తూ వస్తున్నాయి. అక్కడ ఒకప్పుడు భారీ నదీ వ్యవస్థలు ఉండేవని, అక్కడ మంచుకురుస్తుందని ఇలా అనేక అంచనాలు వేశారు. ఇప్పటికే రోవర్లు అంగారకుడిపై దిగి, మొత్తం తిరిగేస్తూ అక్కడి పరిస్థితిని, విచిత్ర పరిస్థితులను తెలియజేస్తున్నాయి. తాజాగా మార్స్‌ క్యూరియాసిటీ రోవర్‌ (Mars Curiosity Rover) తేనెపుట్ట లేదా వాఫల్స్‌ తరహాలో ఉన్నట్టు చెబుతున్న నిర్మాణాలను గుర్తించింది. షడ్బుజాకారంలో (hexagonal shapes) ఉన్నాయి. వీటిని గేల్‌ క్రాటర్‌ లోపల కనుగొన్నారు.

పగుళ్ల తరహాలో నిర్మాణాలు

అంగాకుడి ఉపరితలంపై పగుళ్ల తరహాలో ఈ నిర్మాణాలు ఉన్నాయి. అంగారకుడిపై జీవం ఎలా ప్రారంభం అయిందనే విషయంలో అవి కీలక అంశాలను వెల్లడించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ నిర్మాణాల కూర్పును క్యూరియాసిటీ (Curiosity) విశ్లేషిస్తున్నది. అవి ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకునేందుకు ఈ డాటా ఉపకరించనున్నది. అరుణగ్రహంపై ఇటువంటి నిర్మాణాలు గతంలో కూడా కనిపించాయని, కానీ.. ఇవి మాత్రం బాగా రక్షిత స్థితిలో ఉన్నాయని న్యూ బ్రున్స్‌విక్‌ యూనివర్సిటీలో ప్లానెటరీ జియాలజిస్ట్‌ డాక్టర్‌ కేథరీన్ ఓ’కానెల్-కూపర్ నాసా కోసం ఒక బ్లాగ్‌లో రాశారు.

తేనె పుట్ట తరహాలో ఆకృతులు

తేనెపుట్ట లేదా వాఫల్‌ వంటి ఆకారాలు సుమారు 36 నుంచి 38 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని భావిస్తున్నారు. కరువు ప్రాంతాల్లో లేదా ఎండిపోయిన చెరువుల్లో భూములు పగుళ్లు తేలిన విధంగా అవి కనిపిస్తున్నాయి. భూమిపై ఎలా బీళ్లు పగుళ్లు తేలిన విధంగానే అంగారకుడిపైనా జరిగి ఉంటుందని, తడి, పొడి వాతావరణాల కారణంగా ఇవి ఏర్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా అవి ఎలా ఏర్పడ్డాయనే పజిల్‌ను ఛేదించడానికి ఇంకా కొంతకాలం పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం వీటిని లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రాస్కోపీగా పిలిచే టెక్నిక్‌తో క్యూరియాసిటీ అధ్యయనం చేస్తున్నది. ఈ నిర్మాణాలను తవ్వడం ద్వారా అందులో దాగి ఉన్న రసాయనాలను వెలికి తీసే పనిలో నాసా శాస్త్రవేత్తలు ఉన్నారు. దానితోపాటే దాని సమీప ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరిపి, రెండింటి మధ్య తేడాలను గమనించనున్నారు.

ఎక్కువ మంది చదివిన సైన్స్‌ వార్తలు

Global Warming | గ్లోబల్‌ వార్మింగ్‌తో విస్తరించే ప్రాణాంతక ఫంగస్‌! 33 శాతానికిపైగా మరణాల రేటు!
Climate change | మరో పదిహేనేళ్లలోనే ఆ సిటీల్లో జీవనం అసాధ్యం! ఇండియాలో ఆ సిటీలు కూడా?
Tectonic Interactions | మీరు నమ్మలేరు.. రెండు ముక్కలుగా చీలనున్న భారతదేశం!
Universe End  | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?
Giant Persons | రాక్షసులు నిజంగానే ఈ భూమిపై ఉండేవారా? వారి కథేంటి?

Exit mobile version