Site icon vidhaatha

Life on Mars | అంగారకుడిపై ఒకప్పుడు నదీ వ్యవస్థలు, సరస్సులు!.. భూమిలాంటి వాతావరణం?

Life on Mars | చక్కగా ఉన్న భూమిని కాపాడుకునే ప్రయత్నాలు వదిలేసి, దానిని మరింత కాలుష్యభరితంగా, నివాసాలకు అయోగ్యంగా తయారు చేసుకుంటున్న మానవుడు.. తాను నివసించడానికి యోగ్యమైన గ్రహాల వేటలో (hunt for planets) పడ్డాడు. సరే.. అదీ ఒకందుకు మంచిదే. భవిష్యత్తులో అక్కడినుంచి ఖనిజ (extract mineral) సంపదను తెచ్చుకునే వీలుంటుందేమో! సౌర కుటుంబంలో మానవుడు నివసించేందుకు (humans to live on) అనువైన వాతావరణం అంగారకుడిపై (Mars) ఉండచ్చనే భావనతో ఆ గ్రహంపై శాస్త్రవేత్తలు భారీ ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర సంగతులు బయటపడుతున్నాయి.

ఒకప్పుడు అంగారక గ్రహంపై నదులు, సరస్సుల వ్యవస్థలు ఉండేవని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అంగారకుడిపైకి నాసా పంపించిన పెర్సెవరెన్స్‌ రోవర్‌.. పురాతన నదీ డెల్టా ప్రాంతాలను అన్వేషించించింది. జెజెరో క్రాటర్‌ (అగ్నిబిలం)గా గురించిన ప్రాంతాల్లోనూ కలియదిరిగి, పరిశోధనలు చేసింది. ఆ పరిశోధనల్లో అక్కడ వందల కోట్ల సంవత్సరాల క్రితం భారీ నది ప్రవహించిందని శాస్త్రవేత్తలకు ఆధారాలు లభించాయి. ఆ జ్వాలాముఖం నిండిపోవడంతో విస్తృతస్థాయి డెల్టా వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని తేలింది.

అయితే.. ఆ నీరు ఎక్కడ నుంచి వచ్చిందనేందుకు ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు. ‘అంతరిక్షం నుంచి తీసిన చిత్రాల్లో అక్కడ ఒక బిలం కనిపించింది. అందుకే దానిని ల్యాండింగ్‌ పాయింట్‌గా ఎంచుకున్నాం. అక్కడ బిలం ఉండటం అనేది ఒకప్పుడు అక్కడ భారీ సరస్సు దానిలో ఉండిందనేందుకు స్పష్టమైన ఆధారం. ఒక సరస్సు నివాసయోగ్యమైన వాతావరణం. డెల్టా శిలలు.. పురాతన జీవ సంకేతాలను భౌగోళిక రికార్డుల్లో శిలాజాలుగా భద్రపర్చగల గొప్ప వాతావరణం’ అని పెర్సెవరెన్స్‌ ప్రాజెక్టులో శాస్త్రవేత్త, కాల్టెక్‌కు చెందిన కెన్‌ ఫార్లీ చెప్పారు.

అంగారకుడు.. చల్లని, పొడి వాతావరణం కలిగిన గ్రహం. అయితే.. ఇది ఒకప్పుడు వెచ్చగా, తడిగా ఉండి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం కూడా.. అక్కడి నీరు ఎడతెగని భారీ వర్షాల కారణంగా చేరిందనేనని తెలుస్తున్నది. ఈ అరుణ గ్రహంపై దాని చరిత్రలోని ఒక సందర్భంలో క్రమం తప్పకుండా వర్షాలు పడి ఉంటాయని, అవే విస్తృత స్థాయిలో నదీలోయలు, సరస్సులు ఇతరత్రా సృష్టించి ఉంటాయని భావిస్తున్నారు.

ఈ అధ్యయనం జియోఫిజికల్‌ రిసెర్చ్‌: ప్లానెట్స్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. అంగారకుడిపై మంచు కరిగి నీటి వనరులు ఏర్పడలేదని కొందరు పరిశోధకులు తేల్చారు. అంగారకుడిపైనా ఒకప్పుడు భూమి తరహా వాతావరణం ఉండేదా? అనేది అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తున్నది. కక్ష్య నుంచి నాసా స్పేస్‌క్రాఫ్ట్‌.. మార్టియన్‌ ఉపరితలాన్ని చిత్రీకరించింది. అక్కడి భూమిపై ఉన్న ప్యాట్రన్స్‌.. వర్షం, మంచు కురిసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఇంత వరకూ కెమెరా కంటికి చిక్కనప్పటికీ.. ఇప్పటికీ అంగారక గ్రహంపై మంచు కురుస్తూనే ఉన్నదని నాసా చెబుతున్నది. అంగారకుడి ధృవాలు అత్యంత చల్లదనానికి గురైనప్పుడు, రాత్రివేళ మేఘాలు కమ్ముకున్నప్పుడు మంచు కురుస్తున్నది.

ఇవి కూడా చదవండి..

Indian Navy | ఇండియన్ నేవీ.. యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం సక్సెస్!
eggs found in volcano | వేల గుడ్లను పొదుగుతున్న అగ్నిపర్వతం? ఎక్కడ.. ఆ కథేంటి?
Viral | వీళ్ల‌కేం పుట్టిందిరా.. పెళ్లి చేసుకున్న ఇద్ద‌రు అమ్మాయిలు!
Maoists | కర్రెగుట్టల నుంచి మకాం మార్చిన మావోయిస్టులు! ఆపరేషన్‌లో కీలక మలుపు..

 

Exit mobile version