Site icon vidhaatha

Maoists | కర్రెగుట్టల నుంచి మకాం మార్చిన మావోయిస్టులు! ఆపరేషన్‌లో కీలక మలుపు..

విధాత ప్రత్యేక ప్రతినిధి:
Maoists | తీవ్ర ఆందోళనతో పాటు ఉత్కంఠను రేపిన కర్రెగుట్టల్లో ఛత్తీస్‌గఢ్‌ ఆపరేషన్ కీలక మలుపు జరిగింది. వేలాదిమంది భద్రతా బలగాలు నిర్వహించిన ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో భారీ గుహను గుర్తించారు. దీన్ని మావోయిస్టులు బంకర్‌గా వినియోగించినట్లు భావిస్తున్నారు. వెయ్యి మంది ఉండేలా భారీ గుహ ఉన్నట్లు, నీటి సౌకర్యం కూడా ఉన్నట్లు గుర్తించారు. భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు ముందే మకాం మార్చినట్లు చెబుతున్నారు.

కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. గుహ విజువల్స్‌ను భద్రతా బలగాలు విడుదల చేయడం గమనార్హం. ఏది ఏమైనా ప్రస్తుతానికి కర్రెగుట్టలనుంచి మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెబుతున్నారు. దీనికి ముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టులకు కీలక స్థావరంగా మారిన కర్రెగుట్టల వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేసేందుకు భద్రత దళాలు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

కర్రెగుట్టలు దట్టమైన అటవీ ప్రాంతం. సాయంత్రం నాలుగైందంటే చాలు.. ఐదు అడుగుల దూరంలో ఉన్న మనుషులు కూడా కనిపించనంత చీకటి అలుముకుంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ సురక్షిత స్థావరంగా భావిస్తారు. అందులోనూ ఆ ప్రాంతం వారికి కొట్టినపిండి. కానీ.. బలగాలకు మొత్తం కొత్తే కావడంతో ఇక్కడ ఆపరేషన్‌ నిర్వహించడం పెను సవాళ్లు విసురుతున్నది.

ఇవికూడా చదవండి

KCR | అదే మాట.. అదే పాట..కేసీఆర్ బాట! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 1
Eggs | కోడిగుడ్లు.. కొలెస్ట్రాల్‌ బాంబులా? కార్డియాలజిస్ట్‌ ఏమంటున్నారంటే?
Machilipatnam | మచిలీపట్నం.. అదేనండీ.. బందర్‌కు ఆ పేరెలా వచ్చింది?మీకు తెలుసా

 

Exit mobile version