Tech tips | మీ మొబైల్‌ను వారానికోసారైనా రీస్టార్ట్‌ చేయకపోతే డేంజర్‌.. ఎందుకో తెలుసా..?

Tech tips : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ దర్శనమిస్తున్నది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను జాగ్రత్తగా వినియోగించకపోతే వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడే ప్రమాదం ఉంది. దాంతో ఆర్థికంగా, సామాజికంగా నష్టాలను చవిచూడాల్సిన పరస్థితి వస్తుంది.

  • Publish Date - June 7, 2024 / 07:30 PM IST

Tech tips : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ దర్శనమిస్తున్నది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను జాగ్రత్తగా వినియోగించకపోతే వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడే ప్రమాదం ఉంది. దాంతో ఆర్థికంగా, సామాజికంగా నష్టాలను చవిచూడాల్సిన పరస్థితి వస్తుంది. అందుకే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తరచూ ఫోన్‌ రీస్టార్ట్

ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్‌ ఫోన్‌లను తరచూ రీస్టార్ట్‌ చేయాలి. మాల్‌వేర్ అటాక్‌ల బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి. మాల్‌వేర్ ముప్పు నుంచి ఫోన్‌ను సురక్షితంగా ఉంచడంలో ఇది చాలా దోహదపడుతుంది.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌

మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోపాటు అన్ని యాప్‌లను తరచూ అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఇవి హ్యాకర్ల నుంచి ఫోన్‌ను రక్షించడంలో సహాయపడతాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు తరచుగా సెక్యూరిటీ ప్యాచ్‌లను కలిగి ఉంటాయనే సంగతిని గుర్తించాలి.

పబ్లిక్ Wi-Fi తో జాగ్రత్త

పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. దాంతో మన సమాచారం దొంగిలించబడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తే తప్పనిసరిగా VPNని ఉపయోగించండి.

బ్లూటూత్‌ ఆఫ్‌ చేయాలి

మీరు బ్లూటూత్‌ని ఉపయోగించకుండా ఉన్నప్పుడు దాన్ని తప్పనిసరిగా ఆఫ్‌లో ఉంచండి. తద్వారా మీ ఫోన్‌కి ఇతర తెలియని స్మార్ట్ యాక్ససరీస్ కనెక్ట్ కాకుండా ఉంటాయి. దాంతో మీ సమాచారం భద్రంగా ఉంటుంది.

యాప్‌లతో బీ కేర్‌ఫుల్‌

Google Play Store లేదా Apple App Store లాంటి అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. తెలియని మూలాల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం మానుకోండి. ఎందుకంటే అవి మాల్‌వేర్‌ బారినపడే అవకాశం ఉంది.

బలమైన పాస్‌వర్డ్స్‌

మీ ఫోన్‌లోని సమాచారం రక్షణ కోసం స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్‌, స్ట్రాంగ్‌ పిన్‌ నంబర్లను సెట్ చేసుకోండి. అంతేగాక మీ పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండండి. ఫేస్ లాక్ లేదా వేలిముద్ర లాంటి ఫీచర్‌లను కూడా వినియోగించండి.

Latest News