VinFast EV India | వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీదారు విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లోకి ప్రవేశిస్తూ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు విఎఫ్ 6 మరియు విఎఫ్ 7కి జూలై 15 నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. 21,000 రూపాయల రిఫండబుల్ డిపాజిట్‌తో వినియోగదారులు తమకు ఇష్టమైన మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు. అధికారిక ప్రారంభం ఆగస్టులో జరగనుండగా, తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్ ప్రారంభోత్సవం తర్వాత డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విఎఫ్ 6 సుమారు 440 కిలోమీటర్ల రేంజ్ కలిగిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాగా, విఎఫ్ 7 450 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే మిడ్-సైజ్ ఎస్యూవీ.
విఎఫ్ 6లో 59.6 kWh బ్యాటరీ, 201 bhp శక్తినిచ్చే ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ధరలు 18 లక్షల నుండి 24 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. విఎఫ్ 7లో 75.3 kWh బ్యాటరీ, అధిక సౌకర్యాలతో కూడిన ప్రీమియం ఇంటీరియర్, వైర్‌లెస్ చార్జింగ్, పెద్ద టచ్‌స్క్రీన్, పానోరామిక్ గ్లాస్ రూఫ్ వంటి అధునాతన సదుపాయాలు ఉంటాయి. విఎఫ్ 7 ధరలు 30 లక్షల నుండి 35 లక్షల మధ్య ఉండనున్నాయని అంచనా. రెండు మోడల్స్‌లోనూ లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), కనెక్టెడ్ కార్ ఫీచర్లు, సిగ్నేచర్ LED లైటింగ్, పానోరామిక్ రూఫ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.
విన్ఫాస్ట్తన డీలర్‌షిప్ మరియు సర్వీస్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 27 నగరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, కోల్‌కతా, కోచిన్, విశాఖపట్నం, లక్నో, కొయంబత్తూర్ వంటి నగరాల్లో 35 షోరూమ్స్ మొదటి దశలో ప్రారంభమవుతాయి. సర్వీస్ మరియు చార్జింగ్ కోసం RoadGrid, myTVS, Global Assure వంటి సంస్థలతో విన్ఫాస్ట్భాగస్వామ్యం చేసుకుంది. బ్యాటరీ రీసైక్లింగ్ మరియు రీయూజ్ కోసం BatX Energiesతో ఒప్పందం కుదుర్చుకుంది.
భారత మార్కెట్‌లో విఎఫ్ 6 మరియు విఎఫ్ 7 మోడల్స్ శ్రద్ధను ఆకర్షిస్తున్నాయి. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ మోడల్స్‌కు ఇప్పటికే మంచి డిమాండ్ కనిపిస్తోంది. CEO ఫామ్ సంహ్ చౌ మాట్లాడుతూ, “భారత వినియోగదారుల స్పందన మా ఉత్సాహాన్ని పెంచింది. ఈ మోడల్స్ స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి” అని తెలిపారు.