న్యూ ఇయర్ వేడుకల నేపధ్యంలో రాత్రి వేళ విందులు..వినోదాల పేరుతో గడిపి రోడ్లపైన డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష విధించనన్నుట్లుగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించింది. న్యూఇయర్ సందర్భం ఆదివారం రాత్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, 10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ కార్యాలయం అలర్ట్ చేసింది.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. డ్రగ్ వంటి మత్తు పదార్దాలను వినియోగించిన వారిని గర్తించేందుకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లకు డ్రాగ్గర్, అబౌట్ పరికరాలను 25 చొప్పున అందించారు. దీంతో ఈ సంవత్సరం న్యూ ఇయర్ సంబరాల్లో మందుబాబులు విచ్చలవిడి వేషాలు వేయకుండా పోలీస్ శాఖ గట్టిగానే కళ్లెం వేసేలా కనిపిస్తుంది