విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్ధీతో క్యూలైన్లు కిటికిటలాడాయి. దర్శనం కోసం క్యూలైన్లలోని భక్తులు రెండు నుంచి మూడు గంటల పాటు వేచి ఉండాల్సివచ్చింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు టి.వినోద్‌కుమార్, బి.విజయ్ సేన్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక రోజు దేవస్థానం ఆదాయం 42లక్షల 353రూపాయలుగా వచ్చింది. కాగా జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా దేవస్థానానికి వచ్చే భక్తుల రద్ధీ కోసం ప్రత్యేేక అదనపు ఏర్పాట్లు చేసినట్లుగా ఈవో రామకృష్ణారావు తెలిపారు.
ఉదయం 3గంటల నుంచి 3.30వరకు సుప్రభాతం మొదలు నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని తెలిపారు. వరుసగా ఆరాధన, బాలభోగం, తిరుప్పావై, నిజాభిషేకం, సహస్రనామార్చన, 6.30నిమిషాలకు ఉభయ దర్శనాలు, 9నుంచి 10గంటల వరకు బ్రేక్ దర్శనం, 1నుంచి 4గంటల వరకు ఉభయ దర్శనాలు, 4నుంచి 7గంటల వరకు బ్రేక్ దర్శనాలు, 5నుంచి 7.30వరకు ఉభయ దర్శనాలు, 7.30కి సహస్ర నామార్చన, రాత్రి 8.15గంటలకు ఉభయ దర్శనాలు, 9గంటలకు నివేధన, 9.45గంటలకు శయనోత్సవ దర్శనం నిర్వహించనున్నట్లుగా తెలిపారు.