విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండలోని నయీం నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. తేజస్వీ హై స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలేపల్లి జయంత్ వర్థన్ అనే బాలుడు పాఠశాలలో ఆటలు ఆడే సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. వామ్‌అప్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో పాఠశాల సిబ్బంది ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలుడి ముక్కు, చెవిలోనుంచి రక్త స్రావం జరిగినట్లు గుర్తించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలుడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు అకాలమరణం చెదడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు.
Hanamkonda : వామ్‌అప్ చేస్తూ పదోతరగతి విద్యార్థి మృతి
