2026 Holidays | 2026 సెల‌వుల జాబితా విడుద‌ల‌.. త్వ‌ర‌లోనే ప‌ది ప‌రీక్ష‌ల షెడ్యూల్..!

2026 Holidays | తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 2026 ఏడాదికి సంబంధించి సెలవుల జాబితాను విడుద‌ల చేసింది. 2026లో మొత్తం మొత్తం 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను ఖరారు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు జీవో జారీ చేశారు.

2026 Holidays | హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 2026 ఏడాదికి సంబంధించి సెలవుల జాబితాను విడుద‌ల చేసింది. 2026లో మొత్తం మొత్తం 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను ఖరారు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు జీవో జారీ చేశారు.

2026 సెలవుల జాబితా విడుద‌లైన నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ కూడా రెండు, మూడు రోజుల్లో విడుద‌ల కానుంది. రంజాన్, శ్రీరామ‌న‌వ‌మి సెల‌వుల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌ది ప‌రీక్ష‌ల టైమ్ టేబుల్‌ను సిద్ధం చేస్తామ‌ని గ‌తంలో విద్యాశాఖ ప్ర‌క‌టించింది. సెలవుల జాబితా కోసం ఎదురుచూసిన విద్యాశాఖ‌.. మొత్తానికి హాలీడేస్ లిస్ట్ విడుద‌ల కావ‌డంతో.. ప‌ది ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను కూడా ఖ‌రారు చేయ‌నుంది. వ‌చ్చే ఏడాది మార్చి 16 లేదా 18 నుంచి పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

2026 సెలవులు ఇవే..

జవవరి 14వ తేదీన భోగి, 15న సంక్రాంతి సెలవులు ప్రకటించగా.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సెలవు కేటాయించింది. ఇక ఫిబ్రవరి విషయానికొస్తే.. 15వ తేదీన మహాశివరాత్రి, మార్చి 3వ తేదీన హోలీ, 19న ఉగాది, 21న రంజాన్, 22న రంజాన్ తర్వాతి రోజు, 27న శ్రీరామనవమి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్‌లో 3న గుడ్ ఫ్రైడే, 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 14న అంబేద్కర్ జయంతి సెలవులు కేటాయించింది. ఇక మేలో 27న బక్రీద్, ఆగస్టు 10న బోనాలు, సెప్టెంబర్ 14న వినాయకచవితి, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20వ తేదీన విజయదశమి సెలవులు ఇచ్చింది..ఇక నవంబర్ 8న దీపావళి, 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్ హాలీడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News